తొలిరోజే సర్కార్‌కు కోలుకోలేని దెబ్బ.. నష్టం జరిగిపోయింది!
తమిళ స్టార్ హీరో విజయ్, ప్రముఖ దర్శకుడు మురుగదాస్ క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ సర్కార్. నేడు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ విడుదల జరిగింది. విజయ్ అభిమానుల కోలాహలం కొనసాగుతోంది. కొంత ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి డివైడ్ టాక్ వస్తోంది. కానీ తొలి రోజు వసూళ్లు మాత్రం భారీ స్థాయిలో ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా సర్కార్ చిత్రానికి భారీ షాక్ తగిలింది. ఈ చిత్రం మొత్తం తొలి రోజే ఆన్లైన్ లో లీక్ అయిపోవడంతో నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు.

విజయ్ సినిమాపై పైరసీ పంజా
పైరసీ అనేది చిత్ర పరిశ్రమకు తప్పని బెడద. పైరసీ వలన నిర్మాతలకు కలిగే నష్టం అంతా ఇంతా కాదు. ఈ సారి పైరసీ పంజా స్టార్ హీరో విజయ్ సర్కార్ చిత్రంపై పడింది. తొలి రోజే ఈ చిత్రం ఆన్లైన్ లో లీక్ కావడంతో సినీ వర్గాలు షాక్ కి గురవుతున్నాయి.

కొన్ని గంటల్లోనే
ఈ చిత్ర తొలి షో పడ్డ కొన్ని గంటల్లోనే పైరసీ ఆన్లైన్ లోకి వచ్చేసినట్లు తెలుస్తోంది. దీనితో చిత్ర యూనిట్, యాంటీ పైరసీ స్క్వాడ్ రంగంలోకి దిగి నష్ట నివారణ చర్యలు చేపడుతున్నారు. ఆన్లైన్ లో ఉన్న సర్కార్ చిత్ర పైరసీ లింకులన్నింటిని తొలగిస్తున్నారు.

నష్టం జరిగిపోయింది
ఇప్పుడు ఎన్ని చర్యలు తీసుకున్న అది నామమాత్రం మాత్రమే అని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల సినిమాని డౌన్ లోడ్ చేసుకుని ఉంటారని, జరగాల్సిన నష్టం జరిగిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నష్ట ప్రభావాన్ని తగ్గించడానికి మాత్రమే ఇప్పుడు తీసుకునే చర్యలు ఉపయోగపడుతాయని అంటున్నారు.

తమిళ్ రాకర్స్
తమిళ్ రాకర్స్ అనే ఆన్లైన్ సంస్థ ద్వారా ఈ పైరసీ దందా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఇటీవల హీరో కార్తీ చినబాబు, విశాల్ పందెం కోడి 2 చిత్రాలు కూడా విడుదలైన కొన్ని గంటలోనే పైరసీ బారీన పడ్డాయి.

కష్టపడుతున్న విశాల్
హీరో విశాల్ ప్రస్తుతం తమిళ నిర్మాతల మండలికి చైర్మన్ గా ఉన్నాడు. గత ఏడాది నుంచి పైరసీని అరికట్టడానికి విశాల్ చేస్తున్న కృషి అంతా ఇంతా కాదు. ఇందులో కొంతవరకు విశాల్ విజయం సాధించాడు. గత ఏడాది తమిళ్ రాకర్స్ సంస్థకు చెందిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేయడంలో విశాల్ కీలక పాత్ర పోషించాడు. కానీ పైరసీ మాత్రం పూర్తిగా నిర్మూలన కావడం లేదు.


Click it and Unblock the Notifications











