సర్కార్ కధ లీక్.. దర్శకుడిపై దెబ్బ పడింది.. క్షమాపణ చెప్పి..
తమిళ సూపర్‌స్టార్ విజయ్ నటించిన సర్కార్ సినిమా కథకు సంబంధించిన కాపీ వివాదం కోలీవుడ్‌ను కుదిపేస్తున్నది. సర్కార్ కథ నాదే అంటూ కోర్టుకెక్కిన వివాదానికి ఇటీవల పరిష్కారం లభించింది. కోర్టు వెలుపల సెటిల్మెంట్ చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. అయినా ఆ వివాదం ప్రముఖ దర్శకుడు పదవికి ఎసరుపెట్టింది. ఎంతకు ఏం జరిగిందంటే..

కథను లీక్ చేసినందుకు
సర్కార్ కథ కాపీ వివాదం మీడియాలోకి ఎక్కడానికి ముందు దక్షిణ భారత సినీ రచయితల సంఘానికి రచయిత వరుణ్ రాజేంద్రన్ ఫిర్యాదు చేశాడు. దాంతో సంఘం అధ్యక్షుడు భాగ్యరాజా దానిపై స్పందించాడు. ఇద్దరి కథలు ఒకేలా ఉన్నాయని, సర్కార్ సినిమా స్టోరిని మీడియా ముందు పెట్టాడు.

సన్ టెలివిజన్ మండిపాటు
సర్కార్ కథను బయటకు వెల్లడించడంపై సన్ టెలివిజన్ మండిపడింది. దర్శకుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. రిలీజ్ కాకుండా కథను ఎలా చెబుతావు అని నిరసన వ్యక్తం చేశారు. దాంతో భాగ్యరాజాపై విమర్శలు వెల్లువెత్తాయి.

మనస్తాపం చెందిన
సన్ టీవీ, దర్శకుల నిరసనతో మనస్తాపం చెందిన సంఘం అధ్యక్షుడు భాగ్యరాజా తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దర్శకుడు మురుగదాస్‌కు కోర్టు బయట సెటిల్ చేసుకోమని రిక్వెస్ట్ చేశాను. కానీ ఆయన రిజెక్ట్ చేశాడు. దాంతో నేను కథ చెప్పాల్సి వచ్చింది అని అన్నారు.

బేషరతుగా క్షమాపణ చెప్పి
సర్కార్ కథను బయటకు చెప్పినందుకు సన్ టెలివిజన్, చిత్ర యూనిట్‌కు బేషరతుగా క్షమాపణ చెబుతున్నాను. నా తప్పుకు బాధ్యతగా నేను అసోసియేషన్ పదవికి రాజీనామా చేస్తున్నాను అని భాగ్యరాజా ఓ ప్రకటనలో తెలిపారు.

భాగ్యరాజా నిర్ణయంతో
భాగ్యరాజా తన పదవికి రాజీనామా చేశాడనే వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పలువురు తన రాజీనామాను ఉపసంహరించుకొమని చెప్పారు. కానీ ఆయన అందుకు నిరాకరించారు. ఈ నేపథ్యంలో సంఘం కార్యదర్శి మనోజ్ కుమార్ మాట్లాడుతూ.. భాగ్యరాజా రాజీనామాను ఆమోదించకూడదని సంఘం సభ్యులు నిర్ణయం తీసుకొన్నామని అన్నారు.


Click it and Unblock the Notifications











