మురుగదాస్ ‘సర్కార్’ స్టోరీ కాపీ వివాదం... రూ. 30 లక్షలతో కాంప్రమైజ్?
Recommended Video

విజయ్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సర్కార్' మూవీ కథ తనదే అంటూ తమిళ రచయిత, అసిస్టెంట్ డైరెక్టర్ వరుణ్ రాజేంద్రన్ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. దక్షిణభారత రచయితల సంఘం సైతం వరుణ్ రాజేంద్రన్‌కు మద్దుతు ప్రకటించాయి.
అయితే దర్శకుడు మురుగదాస్... ఈ స్టోరీ తాను కాపీ కొట్టలేదని, వరుణ్ రాజేంద్రన్‌కు క్రెడిట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పడంతో విషయం కోర్టు వరకు వెళ్లింది. నేడు(అక్టోబర్ 30) ఈ కేసులో మద్రాస్ కోర్టు తీర్పు వెలువరించాల్సి ఉండగా నిన్ననే ఇరు వర్గాల మధ్య రాజీకుదిరిట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని అఫీషియల్‌గా వెల్లడించలేదు.

రూ. 30 లక్షలు, టైటిల్ క్రిడిట్ ఇవ్వడానికి ఓకే చెప్పారా?
తనకు రూ. 30 లక్షల రెమ్యూనరేషన్‌తో పాటు, టైటిల్ క్రెడిట్ ఇవ్వాలని వరుణ్ రాజేంద్రన్ డిమాండ్ చేస్తూ వస్తున్నారు. చివరకు మురుగదాస్‌తో పాటు సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ ఇందుకు అంగీకరించి రాజీ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.

కోర్టు విచారణకు వరుణ్ మిస్
మంగళవారం ఉదయం ఈ కేసు మద్రాస్ హైరోర్టులో విచారణకు వచ్చింది. అయితే దర్శకుడు ఏఆర్ మురుగదాస్, సౌతిండియన్ ఫిల్మ్ రైటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె భాగ్యరాజ్ హాజరైనప్పటికీ... వరుణ్ రాజేంద్రన్ రాలేదు. దీంతో సన్ పిక్చర్స్ వారు రాజీకి సిద్ధమని కోర్టుకు తెలిపినట్లు సమాచారం.

ఎలాంటి వివాదం లేకుండా సర్కార్ రిలీజ్
వరుణ్ రాజేంద్రన్ విచారణకు హాజరు కాక పోవడంతో... జడ్జి కొన్ని గంటల పాటు కేసును వాయిదా వేశారు. దీంతో వరుణ్ తరుపు నుంచి సర్కార్ విషయంలో ఎలాంటి అభ్యంతరాలు లేవని, కాంప్రమైజ్ జరిగినట్లు, ఎలాంటి సమస్య లేకుండా సర్కార్ మూవీ విడుదల కాబోతోందనే ప్రచారం మొదలైంది.

సర్కార్
విజయ్, కీర్తీ సురేష్, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సర్కార్' మూవీ దీపావళి సందర్భంగా నవంబర్ 7న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











