twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘సర్కార్’ కలెక్షన్ల మోత మొదలైంది... అభిమానులను దోచేస్తున్నారు!

    |

    తమిళ స్టార్ విజయ్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సర్కార్' గ్రాండ్‌గా రిలీజైంది. దాదాపు 3వేలకు పైగా స్క్రీన్లలో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. విడుదలైన అన్ని ఏరియాల్లో సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. సినిమా మొదటి భాగం వినోదాత్మకంగా, రెండో భాగం పొలిటికల్ ఎలిమెంట్స్‌తో సందేశాత్మకంగా ఉందని అనే టాక్ వినిపిస్తోంది.

    అయితే అదనపు షోలు వేయడానికి వీల్లేదని మద్రాస్ హై కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో చెన్నై సిటీలో నిన్నరాత్రే మొదలవ్వాల్సిన సందడి తగ్గింది. అయితే చాలా చోట్ల అనధికారికంగా తెల్లవారు ఝామున షోలు ప్రదర్శించినట్లు సమాచారం.

    రేట్లు పెంచి అభిమానులను దోచేస్తున్నారు

    రేట్లు పెంచి అభిమానులను దోచేస్తున్నారు

    విజయ్‌కు అభిమానుల్లో ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకుని చాలా ఏరియాల్లో థియేటర్ల యజమాన్యాలే టిక్కెట్లను బ్లాక్‌లో అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. మామలూ రేట్ల కంటే మూడు నాలుగు రెట్లు ఎక్కువ రేటుకు అమ్ముతూ అభిమానులను దోచేస్తున్నారు.

    కలెక్షన్ల మోత మొదలైంది

    కలెక్షన్ల మోత మొదలైంది

    ‘సర్కార్' మూవీ విడుదలైన అన్ని చోట్ల కలెక్షన్స్ మోత మొదలైంది. యూఎస్ఏ ప్రీమియర్ షో రిపోర్ట్స్ పరిశీలిస్తే... అక్కడి కాలమానం ప్రకారం నవంబర్ 5, సాయంత్రం 6 గంటల వరకు $247,894 వసూలు చేసింది. ఇది కేవలం 126 లొకేషన్ల నుంచి అందిన సమాచారం మాత్రమే. యూఎస్ఏ వ్యాప్తంగా 150కి పైగా స్క్రీన్లలో ఈచిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. విజయ్ గత చిత్రం ‘మెర్సల్' ప్రీమియర్ షో కలెక్షన్ రికార్డ్ $347k. ఈ రికార్డును ‘సర్కార్' అధిగమిస్తుందో? లేదో? చూడాలి.

    రూ. 135 కోట్లకు థియేట్రికల్ రైట్స్

    రూ. 135 కోట్లకు థియేట్రికల్ రైట్స్

    తమిళనాడు, ఇతర సౌత్ స్టేట్స్, ఓవర్సీస్ ఇలా అన్ని ఏరియాల్లో కలిపి రూ. 135 కోట్లకు ‘సర్కార్' థియేట్రికల్ రైట్స్ అమ్మారు. దీపావళి సీజన్ కావడం, మంగళవారమే సినిమా థియేటర్లలోకి రావడంతో వీకెండ్ నాటికి రూ. 100 నుంచి రూ. 120 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.

    ఫస్ట్ డే ఓపెనింగ్స్ రూ. 50 కోట్లపైనే ఉంటుందని అంచనా?

    ఫస్ట్ డే ఓపెనింగ్స్ రూ. 50 కోట్లపైనే ఉంటుందని అంచనా?

    ‘సర్కార్' మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 50 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అన్ని ఏరియాల్లో భారీ ఎత్తున అడ్వాన్స్ బుకింగ్ జరిగింది.

    తమిళనాడులో విజయ్ మేనియా

    తమిళనాడులో విజయ్ మేనియా

    ‘సర్కార్' విడుదల నేపథ్యంలో గత వారం రోజులుగా తమిళనాడులో విజయ్ మేనియా నెలకొంది. అభిమానులు చెన్నైలో అత్యంత ఎత్తైన కటౌట్ ఏర్పాటు చేశారు. చెన్నై, బెంగుళూరులో అభిమానులు ర్యాలీ నిర్వహించారు. సొంత రాష్ట్రంలో విజయ్ సినిమాకు డిమాండ్ ఎక్కువ ఉండటంతో రూ. 81 కోట్లకు రైట్స్ అమ్ముడయ్యాయి.

    English summary
    "Sarkar USA hourly gross for premieres on 5 November at 6:30 pm PST is $247,894 from 126 locations with per location average of $1,967. Terrific! " movie trade analyst tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X