రజనీని రక్షించే కేపబులటీ ఆ హీరో కుందా

దాంతో తప్పని పరిస్ధితిల్లో తాము తర్వాత డిస్ట్రిబ్యూట్ చేయబోయే సరోజ సినిమాను ఎగ్జిబీటర్స్ కి కాంపన్శేషన్ గా ఇస్తామని ఎగ్రిమెంటు చేసుకున్నారని తెలుస్తోంది. అయితే ఆ సినిమాలో కోదండరామిరెడ్డి వైభవ్ హీరో.శ్రీహరి మరో ప్రధాన పాత్రను పోషించారు. స్క్రీన్ ప్లే ప్రధానంగా జరిగే ఈ సినిమా కూడా అటుఇటు అయితే మా పరిస్దితి ఏమటన్నది కొందరి ప్రశ్న.
అయితే సరోజ దర్శకుడు గతంలో క్రికెట్ నేపద్యంలో వచ్చిన ఓ సినిమా ద్వారా పెద్ద హిట్ ఇచ్చాడని ఇప్పుడూ హిట్ ఖాయం అంటున్నారు. సర్లే చంద్రముఖి ని డైరక్ట్ చేసిన పి.వాసు చిత్రమనే ఈ సినిమా కొన్నాం .ఈ పరిస్దితి వస్తుందని ఊహిస్తామా అయినా ఓపినింగ్స్ అయినా రావటానికి వైభవ్ కి రజనీకాంత్ ఉన్న రేంజి ఉందా అంటున్నారు. ఈ సినిమా అన్నా హిట్టయి వారి సమస్యలు తీరాలని అంతా అనుకుంటున్నారు. ఎందుకంటే ఎగ్జిబీటర్లు పచ్చగా ఉంటేనే పరిశ్రమ పచ్చగా ఉంటుందనేది ఒప్పుకు తీరాల్సిన సత్యం.


Click it and Unblock the Notifications











