Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
సార్పట్ట పరంపర తెలుగు ట్రైలర్: అమెజాన్ ప్రైమ్ లోనే విడుదల.. ఆర్య పవర్ఫుల్ రోల్!
కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం విడుదలకు సిద్దంగా ఉన్న సినిమాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. అయితే కరోనా దెబ్బకు అక్కడ కూడా నిర్మాతలు ఓటీటీ ఆఫర్స్ కు ఎట్రాక్ట్ అవుతున్నారు. థియేట్రికల్ బిజినెస్ పై తమిళ నిర్మాతల్లో కూడా పెద్దగా నమ్మకం లేదు. ఏదైనా పెద్ద సినిమా వస్తే తప్ప అక్కడ మళ్ళీ సినిమా మార్కెట్ ఫామ్ లోకి వచ్చేలా లేదు. ఇక కొందరు కొత్త సినిమాలను ఓటీటీలో విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.
ఆర్య నటించిన 'సార్పట్ట పరంపర' సినిమా కూడా అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ గా విడుదల కాబోతోంది. కబాలి, కాలా వంటి సినిమాలను తెరకెక్కించిన యువ దర్శకుడు పా.రంజిత్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. తమిళ వాతావరణానికి తగ్గట్లుగానే బాక్సింగ్ నేపథ్యంలో రూపొందించారని అర్ధమవుతోంది. ఇక గోల్డెన్ డేస్ లోని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఆ సినిమాపై ఓ వర్గం ప్రేక్షకుల్లో అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి.
ఈ సినిమతో ఆర్య ఎలాగైనా హిట్ టాక్ ను సొంతం చేసుకోవాలని అనుకుంటున్నాడు. ఎందుకంటే చాలా ఏళ్ళుగా అతనికి సక్సెస్ లేదు. ఇక పా.రంజిత్ సినిమాను చాలా రియాలిస్టిక్ గా తెరకెక్కించారని ట్రైలర్ చూస్తేనే అర్ధమవుతోంది. అమెజాన్ ప్రైమ్ లో తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా డబ్ చేసి జూలై 22న రిలీజ్ చేయబోతున్నారు. మరి సినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి. ఇక గతంలో ఆర్య పలు సినిమాలతో తెలుగులో కూడా మంచి క్రేజ్ అందుకున్నాడు. రామ్ - లింగుస్వామి సినిమాలో అతను విలన్ గా నటించే ఛాన్స్ ఉన్నట్లు రూమర్స్ అయితే వస్తున్నాయి.