ఫాక్స్ ఇంటర్నేషనల్, మురగదాస్ సినిమాలో తెలుగు యంగ్ హీరో
ప్రస్ధానం, గమ్యం చిత్రాలతో విలక్షణ నటుడుగా పేరు తెచ్చుకున్న యువ నటుడు శర్వానంద్ కి శ్రమ ఫలించే రోజులు వచ్చాయి. అతను..ఫాక్స్ స్టార్ స్టూడియో (ఫాక్స్ ఇంటర్నేషనల్ వారి అనుభంద సంస్ధ) వారు భారతీయ భాషల్లో నిర్మించే ఛిత్రంలో హీరోగా అతన్ని తీసుకున్నారు. గజనీ దర్శకుడు మురగదాస్..ఈ సంస్ధతో టై అప్ అయి ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. ఈ చిత్రం కోసం కొద్ది రోజుల క్రితమే ఎగ్రిమెంట్ జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. ఇక దర్శకుడు ఎవరు, కథ దేనికి సంభందించింది అన్న విషయాలు త్వరలోనే తెలుస్తాయి. ప్రస్తుతం మురగదాస్..తమిళ హీరో సూర్య, శృతిహాసన్ కాంబినేషన్ లో '7 ఓం అరివు' అనే చిత్రం రూపొందిస్తున్నారు. ఈ చిత్రం కథ సర్కస్ నేపధ్యంలో జరగనుంది. ఈ చిత్రంలో సూర్య సర్కస్ కళాకారుడిగా అలరించేందుకు సిద్ధమవుతున్నారు. దీంట్లో సూర్య పాత్ర చుట్టూనే కథ నడుస్తుంది. యానిమల్ ట్రైనర్ గా ఓ విభిన్నమైన పాత్ర ఇది అని చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











