ఒక్కసారిగా 4 కోట్లకు రెమ్యునేషన్ పెంచేసిన హీరో
నటుడిగా, దర్శకుడిగా శశికుమార్ తొలిచిత్రం 'సుబ్రమణ్యపురం' సంచలన పేరు సొంతం చేసుకుంది. ఆపై సముద్రఖని దర్శకత్వంలో 'నాడోడిగల్'లో ప్రధానపాత్ర పోషించాడు. అది మంచి వసూళ్లు రాబట్టింది. ఆపై 'పసంగ', 'పోరాళి'లో నటించిన శశికుమార్ చివరగా ప్రభాకరన్ దర్శకత్వంలో 'సుందరపాండియన్'లో కనిపించాడు. ఇదికూడా అన్ని వర్గాలను ఆకట్టుకుంది. గత ఏడాది ఘన విజయం అందుకున్న వాటిలో ఒకటిగా నిలిచింది. తాజాగా 'కుట్టిపులి'లో నటిస్తున్నాడు. అవకాశాలు అధికమవుతున్న నేపథ్యంలో పారితోషికాన్ని రూ.4 కోట్లకు పెంచాడు.
ఇక ప్రస్తుతం శశికుమార్ నటించి,నిర్మించిన సుందరపాండ్యన్ చిత్రం తెలుగులో రీమేక్ అవుతోంది. తెలుగులో భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ.. "నేను గతంలో తీసిన చిత్రాలకు ఏ మాత్రం తీసిపోకుండా నా తదుపరి చిత్రం ఉంటుంది. తమిళంలో విజయవంతమైన 'సుందరపాండ్యన్' హక్కుల్ని తీసుకున్నాం. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. నా తదుపరి చిత్రాన్ని తొలి చిత్రంగా భావించి తెరకెక్కిస్తాను. తమిళంలో సుందరపాండ్యన్‌ను శశికుమార్ నిర్మించారు. ఆయన అసిస్టెంట్ ప్రభాకరణ్ తెరకెక్కించారు. నేను ఇన్నాళ్ళు ఎలాంటి కథ కోసం ఎదురుచూస్తున్నానో అలాంటి కథతో తెరకెక్కిన సినిమా ఇది. తెలుగులోనూ మంచి బిగువైన స్క్రిప్ట్‌తో తెరకెక్కిస్తాం'' అని భీమినేని శ్రీనివాసరావు చెప్పారు.


Click it and Unblock the Notifications
