జయలలితగా కాజోల్.. శశికళగా అమలాపాల్.. తెరపైకి శశిలలిత బయోపిక్
తమిళనాడులో మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌లు వెండితెరను ఉక్కిరిబిక్కిరి చేసేలా ఉన్నాయి. ఇప్పటి వరకు ఏ వ్యక్తిపై రూపొందనంతగా దివంగత నేత, సినీనటి జీవితం ఆధారంగా సినిమాలు రావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. జయలలిత బయోపిక్ కేవలం సినిమాలకే పరిమితం కావడం లేదు. వెబ్ సిరీస్ రూపంలో కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వివరాల్లోకి వెళితే..

తలైవిగా క్వీన్ కంగన రనౌత్
ఇప్పటికే దర్శకుడు ఏఎల్ విజయ్ తలైవి పేరుతో ఓ బయోపిక్‌ను ప్రారంభించారు. ఈ చిత్రంలో జయలలితగా కంగన రనౌత్ నటించనున్నారు. ఇక దర్శకుడు ప్రియదర్శని రూపొందించే ది ఐరన్ లేడి చిత్రంలో నిత్యా మీనన్ జయలలితగా కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో శశికళగా వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తారు.

వెబ్ సిరీస్‌తో గౌతమ్ మీనన్
జయలలిత జీవితం ఆధారంగా దర్శకుడు గౌతమ్ మీనన్ ఓ వెబ్ సిరీస్‌ను రూపొందించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ వెబ్ సిరీస్‌లో జయలలితగా రమ్యకృష్ణ నటించనున్నారు. అంతేకాకుండా దర్శకులు లింగు స్వామి ఓ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఆర్జీవి డైరెక్షన్‌లో శశికళ
లక్ష్మీస్ ఎన్టీఆర్ తర్వాత దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా జయలలిత బయోపిక్‌ను టచ్ చేయనున్నారు. ఇప్పటికే శశికళ టైటిల్‌తో సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లే ప్రయత్నం ఆర్జీవి చేస్తున్నాడు. ఆర్జీవి దారిలో మరికొంత మంది జయలలిత మూవీని తెరకెక్కించే ప్రయత్నాలు మొదలుపెట్టారు.

తెరపైకి శశిలలిత బయోపిక్
ఇక ఇప్పటికే లక్ష్మీస్ వీరగ్రంథం సినిమాతో సంచలనం రేపిన నిర్మాత, తమిళనాడు, తెలుగు యువశక్తి నేత కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి శశిలలిత చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు ప్రకటన చేశారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో జయలలిత పాత్ర కోసం కాజోల్, శశికళ పాత్ర కోసం అమలా పాల్‌ను సంప్రదించినట్టు వెల్లడించారు.


Click it and Unblock the Notifications











