twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రజనీకాంత్, కమల్ హాసన్‌పై కట్టప్ప వివాదాస్పద వ్యాఖ్యలు... ఏం జరిగిందంటే?

    |

    తమిళనాట రాజకీయ పరిస్థితులు రసవత్తరంగా మారుతున్నాయి. ఆల్రెడీ అక్కడ డీఎంకె, అన్నాడిఎంకె పార్టీలు చాలా ఏళ్లుగా పాతుకు పోయాయి. అయితే ఆ పార్టీల వల్ల తమిళ ప్రజలకు సరైన న్యాయం జరుగడం లేదంటూ... ప్రముఖ నటులు కమల్ హాసన్, రజనీకాంత్ కొత్త రాజకీయ పార్టీలు స్థాపించిన సంగతి తెలిసిందే.

    ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకె పార్టీ తమిళనాట అత్యధిక స్థానాలు గెలుచుకుని విజయకేతనం ఎగురవేసింది. అయితే ఈ ఎన్నికల్లో శూన్యత ఏర్పడిందని రజనీకాంత్, కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ నటుడు సత్యరాజ్ కౌంటర్ ఇచ్చారు.

    శూన్యత ఎక్కడా లేదంటున్న కట్టప్ప

    శూన్యత ఎక్కడా లేదంటున్న కట్టప్ప

    ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎక్కడా శూన్యత కనిపించలేదని, కొత్తగా పార్టీలు పెట్టిన వారు కూడా ఎక్కడా కనిపించలేదని రజనీకాంత్, కమల్ హాసన్‌ను ఉద్దేశించి సత్యరాజ్ కౌంటర్ ఇచ్చారు. స్టాలిన్ సమర్ధుడని తమిళ ప్రజలు నమ్మారు కాబట్టే ఆయన పార్టీ అభ్యర్థులను గెలిపించారని వ్యాఖ్యానించారు.

    స్థానికేతరులు ఇక్కడ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు

    స్థానికేతరులు ఇక్కడ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు

    స్థానికేతరులు తమిళనాట రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదంటూ సత్యరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ నటుడు రజనీకాంత్‌ను ఉద్దేశించి సత్యరాజ్ ఈ కామెంట్స్ చేసినట్లు స్పష్టమవుతోంది. రాష్ట్రంలో శూన్యత ఏదైనా ఉంటే దాన్ని భర్తీ చేయడానికి స్టాలిన్, దయానిధి మారన్ లాంటి వారు ఉన్నారని తెలిపారు.

    కమల్ హాసన్ పార్టీకి డిపాజిట్ కూడా దక్కలేదు

    కమల్ హాసన్ పార్టీకి డిపాజిట్ కూడా దక్కలేదు

    తమిళనాడులో ఇటీవల కాలంలో సినీ నటులు రాజకీయ పార్టీలు స్థాపించడం చర్చనీయాంశం అయింది. అలాంటి వారి నుంచే రాజకీయ శూన్యత అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మక్కల్ నీది మయ్యం అనే పార్టీ స్థాపించిన కమల్ హాసన్ ఇటీవల ఎన్నికల్లో తన పార్టీ తరుపున అభ్యర్థులను బరిలోకి దింపారు. అయితే ఒక్క సీటు కూడా దక్కకపోగా ఓటు పర్సంటేజీ రాక డిపాజిట్లు కూడా దక్కలేదు.

    రజనీకాంత్‌ను ఉద్దేశించి నాన్ లోకల్ కామెంట్స్ ‘‘ఇప్పటికే ఒక నటుడు రాజకీయ పార్టీని స్థాపించి విఫలం అయ్యారు. మరొక నటుడు ఇప్పుడున్న శూన్యతను భర్తీ చేస్తానని అంటున్నాడు. అసలు ఇక్కడ శూన్యత లేనే లేదు’ అని సత్యరాజ్ స్పష్టం చేస్తున్నారు. రజనీకాంత్‌ను ఉద్దేశించి నాన్ లోకల్ అనే కామెంట్స్ తమిళనాడులో చాలా రోజులుగా వినిపిస్తోంది. శరత్ కుమార్ కూడా గతంలో ఇదే అంశంతో రజనీని పరోక్షంగా టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే.

    రజనీకాంత్‌ను ఉద్దేశించి నాన్ లోకల్ కామెంట్స్ ‘‘ఇప్పటికే ఒక నటుడు రాజకీయ పార్టీని స్థాపించి విఫలం అయ్యారు. మరొక నటుడు ఇప్పుడున్న శూన్యతను భర్తీ చేస్తానని అంటున్నాడు. అసలు ఇక్కడ శూన్యత లేనే లేదు’ అని సత్యరాజ్ స్పష్టం చేస్తున్నారు. రజనీకాంత్‌ను ఉద్దేశించి నాన్ లోకల్ అనే కామెంట్స్ తమిళనాడులో చాలా రోజులుగా వినిపిస్తోంది. శరత్ కుమార్ కూడా గతంలో ఇదే అంశంతో రజనీని పరోక్షంగా టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే.

    ‘‘ఇప్పటికే ఒక నటుడు రాజకీయ పార్టీని స్థాపించి విఫలం అయ్యారు. మరొక నటుడు ఇప్పుడున్న శూన్యతను భర్తీ చేస్తానని అంటున్నాడు. అసలు ఇక్కడ శూన్యత లేనే లేదు' అని సత్యరాజ్ స్పష్టం చేస్తున్నారు. రజనీకాంత్‌ను ఉద్దేశించి నాన్ లోకల్ అనే కామెంట్స్ తమిళనాడులో చాలా రోజులుగా వినిపిస్తోంది. శరత్ కుమార్ కూడా గతంలో ఇదే అంశంతో రజనీని పరోక్షంగా టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే.

    English summary
    Sathyaraj controversial comments on Rajinikanth and Kamal Haasan. Sathyaraj has dismissed Rajinikanth's "vacuum in Tamil Nadu politics" comments.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X