'త్రీ ఇడియిట్స్' రీమేక్ లో బొమన్ ఇరానీ పాత్ర చేసేదెవరంటే...
త్రీ ఇడియిట్స్ చిత్రాన్ని తమిళ,తెలుగు భాషల్లో శంకర్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నెగిటివ్ పాత్ర ప్రిన్సిపాల్ వైరస్ గా చేసిన బొమన్ ఇరాని పాత్రను ఎవరు చేయనున్నారనే విషయమై అంతటా ఆసక్తి నెలకొని ఉంది. అయితే ఆ పాత్రకు శంకర్...తమిళ నటుడు సత్యరాజ్ ని అడిగారని సమాచారం. సత్యరాజ్ తన టిపికల్ మ్యానరిజమ్స్ కి పెట్టింది పేరు. కాబట్టి అతన్ని తీసుకుని ఈ పాత్రను పండిద్దామని శంకర్ ప్లాన్ చేస్తున్నారు. సత్యరాజ్ కూడా ఎన్ని రోజులైనా డేట్స్ ఇవ్వటానికి రెడీ గా ఉన్నారని సమాచారం. ఇక కరీనాకపూర్ చేసిన పాత్రను ఇలియానా రెండు భాషల్లో చేయనుంది. అమీర్ ఖాన్ చేసిన పాత్రను తెలుగులో మహేష్ బాబు, తమిళంలో విజయ్ చేస్తున్నారు. మాదవన్ తన పాత్రను యధాతధంగా అదే పాత్రను పోషిస్తాడని చెప్తున్నారు. అయితే మాధవన్ తాజాగా ట్విట్టర్ లో..ఓకే ప్లోక్స్..ఫర్ ది లాస్ట్ అండ్ ఫైనల్ టైమ్..నేను త్రీ ఇడియట్స్ తమిళ, తెలుగు వెర్షన్స్ లో చేయలేకపోతున్నాను. రియల్లీ సారీ అని ట్వీట్ చేసారు. ఇక శింబు అయితే ఈ చిత్రం చేసే విషయం మాట్లాడుతూ.. టాక్స్ జరుగుతున్న సమయంలో ఈ చిత్రంలో చేస్తున్నానా లేదా అనే విషయం మాట్లాడటం పద్దతి కాదు. నేను సినిమా చూసాను. ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఈ చిత్రం మంచి మెసేజ్ తో ఎంటర్టైన్మెంట్ వే లో వచ్చిన చిత్రం ఇది అన్నారు.


Click it and Unblock the Notifications











