twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఐశ్వర్యరాయ్ భర్త పాత్రలో బాహుబలి కట్టప్ప?

    |

    సత్యరాజ్.. ఈ పేరు ఇండియాలోని ప్రతి ఒక్క ప్రేక్షకుడికి తెలియకపోవచ్చు కానీ, 'కట్టప్ప' అంటే మాత్రం ఇట్టే గుర్తుపడతారు. 'బాహుబలి' సినిమా తర్వాత సత్యరాజ్ అంత పాపులర్ అయ్యార మరి. తాజాగా సత్యరాజ్ గురించి ఓ ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది. త్వరలో మణిరత్నం 'పొన్నియిన్ సెల్వన్' నవల ఆధారంగా రూపొందించే చిత్రానికి సత్యరాజ్ సైన్ చేసినట్లు తెలుస్తోంది.

    'పొన్నియిన్ సెల్వన్' లోని ఓ కీలక పాత్ర కోసం సత్యరాజ్‌ను సంప్రదించారని, ఆయనకు ఆ పాత్ర నచ్చడంతో నటించడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇందులో సత్యరాజ్ పెరియా పళువెట్టరాయర్ అనే ట్రెజరర్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఛోళ సామ్రాజ్యంలో శక్తివంతమైన రెండో పదవి అది.

    ఇంతకు ముందు మోహన్ బాబు పేరు

    ఇంతకు ముందు మోహన్ బాబు పేరు

    ఇంతకు ముందు ఈ పాత్రను టాలీవుడ్ స్టార్ మోహన్ బాబు చేయబోతున్నారని, ఆయన చేయడానికి అంగీకరించారనే వార్తలు సైతం వినిపించాయి. అయితే ఇప్పుడు సత్యరాజ్ పేరు తెరపైకి వచ్చింది. మరి మోహన్ బాబు ఈ ప్రాజెక్టులో ఉన్నారా? వేరే పాత్ర ఏమైనా చేస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది.

    కట్టప్ప భార్యగా ఐశ్వర్యరాయ్

    కట్టప్ప భార్యగా ఐశ్వర్యరాయ్

    ఈ ప్రాజెక్టు చేయడానికి మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ఇందులో పళువూరు ప్రిన్సెస్ నందిని పాత్రలో కనిపించబోతోందని, పెరియా పళువెట్టరాయర్‌ను పెళ్లాడి అతడిని వాడుకుని తన లక్ష్యాలను రీచ్ అయ్యేలా ఆమె పాత్ర ఉంటుందని తెలుస్తోంది.

    ఈ స్టార్ల పేర్లు కూడా ప్రచారంలో

    ఈ స్టార్ల పేర్లు కూడా ప్రచారంలో

    ఈ చిత్రంలో పూంగుళాలి అనే పాత్రో నయనతార, సుందర్ ఛోళర్ అనే పాత్రలో అమితాబ్ బచ్చన్, అరుళ్మోలి వర్మన్ పాత్రలో జయంరవి, ఆదిత్య కరికాలన్ పాత్రలో చియాన్ విక్రమ్, వంతియ దేవన్ పాత్రలో కార్తిని చేయబోతున్నట్లు రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి.

    లైకా ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్‌తో

    లైకా ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్‌తో

    కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్' నవల ఆధారంగా అదే పేరుతో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. తమిళంలోని గ్రెటెస్ట్ నవలల్లో ఒకటిగా దీనికి పేరుంది. లైకా ప్రొడక్షన్స్ వారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.

    English summary
    If the latest reports are to be believed, Sathyaraj has been signed for Mani Ratnam's upcoming movie, presently referred to as Ponniyin Selvan. As per rumours doing the rounds Sathyaraj was approached for an important character in Ponniyin Selvan. Aishwarya Rai was signed to play the role of Pazhuvoor Princess Nandhini, who marries Periya Pazhuvettaraiyar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X