హ్యాపీ యానివర్సరీ మై జాన్.. సాయేషా పోస్ట్ వైరల్
సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు కామన్. హీరో హీరోయిన్లు, దర్శకులు హీరోయిన్లు ఇలా ఎంతో మంది ప్రేమించి పెళ్లి చేసుకున్న సందర్భాలున్నాయి. అలా తమిళ హీరో ఆర్య, హీరోయిన్ సాయేషాలు సైతం ప్రేమలో ముగిని వివాహా బంధంతో ఒక్కటయ్యారు. 2019లో వివాహా బంధంతో ఒక్కటైన ఈ జంటను చూసి అందరూ షాక్ అయ్యారు. ఈ ఇద్దరి మధ్య ఉన్న వయోబేధం చూసి ముక్కుమీద వేలుసుకున్నారు నెటిజన్లు.
అయితే ఈ ఇద్దరూ మాత్రం ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. లాక్డౌన్‌లో సాయేషా చేసిన డ్యాన్స్ వీడియోలన్నీ కూడా ఎంతగా హల్చల్ చేశాయో అందరికీ తెలిసిందే. ఇక గర్భవతి అంటూ వచ్చిన రూమర్లపై సాయేషా ఓ రేంజ్‌లో ఫైర్ అయింది. ఎప్పుడూ మీకు అలాంటి వాటిపైన దృష్టి ఉంటుందా? అది మా వ్యక్తిగత జీవితం అంటూ ఫేక్ న్యూస్‌పై సాయేషా ఓ రేంజ్‌లో మండి పడింది.

సాయేషా ఆర్యల వివాహాం జరిగి నేటికి రెండేళ్లు అవుతోంది. ఈ సందర్భంగా సాయేషా ఓ ఫోటోను షేర్ చేస్తూ.. హ్యాపీ యానివర్సరీ మై జాన్.. ఇప్పుడు ఎప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సాయేషా కన్నడ చిత్రంతో బిజీగా ఉంది. ఆర్య తమిళ తెలుగు చిత్రంతో బిజీగా ఉన్నాడు. విశాల్ , ఆర్య కలిసి ఎనిమీ అనే సినిమాతో రాబోతోన్నారు. మొత్తానికి సాయేషా షేర్ చేసిన ఫోటో మాత్రం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











