బికినీలో స్టార్ హీరో భార్య.. ఇన్స్‌టాలో దుమ్మురేపుతున్న బ్యూటీ ఫోటో

అఖిల్ చిత్రంతో తెలుగులో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన సాయేషా సైగల్ తన అందాలతో కనువిందు చేశారు. తాజాగా తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేసిన బికినీ స్టిల్ వైరల్‌గా మారింది. సాయేషా బికినీ అందాలపై నెటిజన్లు భారీగా కామెంట్లు వదులుతున్నారు. సాయేషా బికిని ఫోటో వెనుక కథ ఏమిటో తెలుసా?

తెలుగులో కెరీర్ ఆరంభించి

తెలుగులో కెరీర్ ఆరంభించి

సాయేషా తన కెరీర్‌ను టాలీవుడ్‌లో ప్రారంభించినప్పటికీ.. తమిళంలో స్థిరపడిపోయారు. జయం రవితో వనమగన్ చిత్రం విజయం సాధించడంతో ఆమెకు కోలీవుడ్‌లో కుప్పలుతెప్పలుగా ఆఫర్లు వచ్చాయి. ఆ తర్వాత విజయ్ సేతుపతితో జుంగా, కార్తీతో కడైకుట్టి సింగం తదితర చిత్రాల్లో నటించింది. హీరో ఆర్యతో కలిసి గజనికాంత్ నటించింది.

ఆర్యతో ప్రేమ, పెళ్లి

ఆర్యతో ప్రేమ, పెళ్లి

గజనీకాంత్‌ చిత్రంలో నటిస్తున్న సమయంలో సాయేషా, ఆర్య ప్రేమలో పడ్డారు. అనంతరం వారి వివాహం గతేడాది మార్చిలో హైదరాబాద్‌లో ఫలక్‌నుమా ప్యాలెస్‌లో వివాహం జరిగింది. ఆ తర్వాత వారిద్దరు సూర్య నటించిన కాప్పన్ సినిమాలో కలిసి నటించారు. ప్రస్తుతం శక్తి సౌందర్య రాజన్ రూపొందించిన టెడ్డీ చిత్రంలో నటించారు. ఆ ఆ చిత్రం త్వరలోనే విడుదల కానున్నది.

 లాక్‌డౌన్‌లో వీడియోతో వైరల్

లాక్‌డౌన్‌లో వీడియోతో వైరల్

ఇలా ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్‌ను బ్రహ్మండంగా బ్యాలెన్స్ చేస్తున్న సాయేషా లాక్‌డౌన్ సమయాన్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఇటీవల ఆమె చేసిన డ్యాన్స్ వీడియో ఇన్స్‌టాగ్రామ్‌లో వైరల్ అయింది. వయ్యారం ఒలకబోస్తూ చేసిన వీడియోతో నెటిజన్లను కేకపెట్టించారు.

బాలీ హాలీడేలో బికినీతో

బాలీ హాలీడేలో బికినీతో

ఇక అదే ఊపులో లాక్‌డౌన్‌కు బాలీలో పర్యటనకు వెళ్లిన సమయంలో దిగిన ఫోటోలను ఇన్స్‌టాలో పోస్టు చేసింది. ఆ ఫోటోల్లో బికినీ ధరించిన బ్యూటీ నీటిపై తేలియాడుతున్న ఫోటోను ఇన్స్‌టాలో పెట్టింది. లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమిమయ్యాను. జలకాలు ఆడి ఎన్ని రోజులైందో అంటూ తన మనసులోని మాటను బయటపెట్టింది.

Recommended Video

Bandobast Movie Teaser
కన్నడ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ

కన్నడ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ

ఇక సాయేషా కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. యువరత్న అనే సినిమా ద్వారా తన కన్నడ ఎంట్రీని ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. బాలీవుడ్ అగ్ర నటులు సైరా బాను, దిలీప్ కుమార్ మనవరాలిగా అందరికి పరిచయం. ప్రస్తుతం ఆర్య భార్యగా జీవితాన్ని పంచుకొంటూ తెరపై తనదైన నటనను ప్రదర్శించానికి సిద్ధంగా ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X