Vijay Antony కూతురిపై ఆ ఒత్తిడి లేదు.. సూసైడ్‌లో టీచర్ ట్విస్ట్ .. ఫోన్ సీజ్.. రంగంలోకి ఫొరెన్సిక్ నిపుణులు!

మ్యూజిక్ డైరెక్టర్, నటుడు, నిర్మాత, దర్శకుడు విజయ్ ఆంటోని కూతురు మీరా ఆత్మహత్య సంఘటన తమిళ సినిమా పరిశ్రమనే కాకుండా దక్షిణాది సినిమా పరిశ్రమను తీవ్ర విషాదంలోకి నెట్టింది. మంగళవారం తెల్లవారుజామున తన ఇంటిలో ఉరివేసుకొని మరణించడం విజయ్ ఆంటోని ఫ్యామిలీని పుట్టెడు దు:ఖానికి గురిచేసింది. పీకల్లోతు శోకంలో మునిగిన విజయ్ ఆంటోని కుటుంబాన్ని తమిళ సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు స్వయంగా పరామర్శించారు. మరికొందరు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని బాధను వ్యక్తం చేస్తున్నారు. మీరా మరణానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

విజయ్ ఆంటోని కూతురు మీరాకు చెన్నైలోని కావెరీ హాస్పిటల్‌లో పోస్ట్ మార్టమ్ నిర్వహించారు. అనంతరం ఆమె భౌతికకాయాన్ని విజయ్ ఆంటోని ఇంటికి తరలించారు. దాంతో పలువురు సినీ ప్రముఖులు విజయ్ ఆంటోని ఇంటికి స్వయంగా వచ్చి పరామర్శిస్తున్నారు. విజయ్ ఆంటోని కుటుంబాన్ని పరామర్శించిన వారిలో సూపర్ స్టార్ విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్, ఉదయనిధి స్టాలిన్, భారతీరాజా, సిద్దార్థ్, నటి రితికా సింగ్, సీనియర్ హీరోయిన్ కుష్బూ, మన్సూర్ ఆలీ ఖాన్ తదితరులు ఉన్నారు.

 Vijay Antonys daughter Meera Suicide Death

ఇదిలా ఉండగా, విజయ్ ఆంటోని కూతురు సూసైడ్ నేపథ్యంలో చెన్నై పోలీసులు కేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకొన్నారు. సూసైడ్ చేసుకొన్న గదిని పోలీసులు తనిఖీలు చేశారు. ఫోరెన్సిక్ నిపుణులు రంగంలోకి దిగి పలు వస్తువులను స్వాధీనం చేసుకొన్నారు. మీరా ఫోన్‌ను కూడా సీజ్ చేశారు. చివరి ఫోన్ కాల్ ఎవరికి వెళ్లింది? చివరి మెసేజ్ ఎవరికి వెళ్లింది? ఎవరి నుంచి వచ్చిందనే కోణంలో ఫొరెన్సిక్ నిపుణులు విచారిస్తున్నారు.

 Vijay Antonys daughter Meera Suicide

మీరా మరణంతో ఆమె చదువుకొనే స్కూల్‌లో కూడా విషాదం నెలకొన్నది. స్కూల్ టీచర్లు, సహ విద్యార్థులు మీరాకు సంతాపం తెలిపారు. చదువు విషయంలో మీరాకు ఎలాంటి ఇబ్బంది లేదు. టాపర్ కాదు కానీ.. తెలివైన విద్యార్థి. ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకొన్నదో అర్ధం కాలేదు. మీరా సూసైడ్ వ్యవహారం మాకు తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది అని స్కూల్‌కు చెందిన టీచర్ తెలిపారు.

మా పాఠశాలలో పిల్లలపై ఎలాంటి ఒత్తిడి చేయం. స్కూల్‌లో ఎలాంటి ఒత్తిడి ఆమెపై లేదు. ఎడ్యుకేషన్ విషయంలో ఎలాంటి సమస్య లేదు. ఇంత చిన్న వయసులో మీరాపై ఎలాంటి ఒత్తిడి ఉందో తెలియదు. ఇలాంటి నిర్ణయం తీసుకొంటుందని మేము ఊహించలేదు. స్కూల్‌లో గానీ, స్కూల్ నుంచి గానీ ఎలాంటి ఒత్తిడి ఆమెపై లేదు అని టీచర్ వెల్లడించారు.

 Vijay Antonys daughter Meera

అయితే మీరా లావుగా ఉన్నాననే ఫీలింగ్‌తో ఉండేది. ఇతర పిల్లలను చూసి ఆత్మనూన్యతాభావంతో బాధపడేది. అయితే మీరా మరణానికి ఇది కారణం కాదని భావిస్తున్నాం. అయితే మీరాను ఇలాంటి తీవ్రమైన నిర్ణయానికి పురిగొల్పిన విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆమె మరణం వెనుక అసలు కారణాలు దర్యాప్తులో బయటపడాలి అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X