విశాల్ దర్శకుడి తండ్రి మాయం, పోలీసులు సెర్చింగ్
చైన్నై : నటుడు మరియు అయిన సినీ దర్శకుడు తరుణ్‌గోపి తండ్రి అదృశ్యమయ్యూరు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పొగరు, కాలై తదితర చిత్రాల దర్శకుడు తరుణ్‌గోపి. విశాల్ తో చేసిన పొగరు చిత్రం ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది.
ఈయన పేచియక్క మరుగమన్ వంటి కొన్ని చిత్రాలలో హీరోగా కూడా నటించారు. తరుణ్‌గోపి మదురవాయల్‌లోని అష్టలక్ష్మి నగర్ రెండవ వీధిలో నివసిస్తున్నారు. ఈయన తండ్రి పేరు పొన్నయ్య (62). ఈయన సోమవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో షాపునకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లి రాత్రి వరకు రాలేదు.
పలుచోట్ల గాలించినా పొన్న య్య జాడ లేకపోవడంతో దర్శకుడు తరుణ్‌గోపి మదురవాయల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పొన్నయ్యను ఎవరైనా కిడ్నాప్ చేశారా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications












