రవితేజతో కలసి నటించడం వెనుక సూర్య సీక్రెట్ ఏంటి..?
తెలుగు మార్కెట్ రుచి చూసిన తమిళ మీరోల్లో సూర్య ముందుంటాడు. తన పారితోషికంలో తెలుగు డబ్బింగ్ రైట్స్ కూడా చేర్చాలని అడుగుతున్నాడంటేనే అతనికి మన మార్కెట్ మీద ఎంత మక్కువో అర్థం చేసుకోవచ్చు. అయితే అనువాద చిత్రాలకి తెలుగునాట అధిక పన్ను పడుతుంటుంది. స్ట్రైయిట్ చిత్రాలతో పోలిస్తే వినోద పన్ను ఎక్కువ కట్టాలి కనుక అనువాద చిత్రాలు ఎంత గడించినా చాలా వరకు దానికే పోతుంది.
అదీకాక అనువాద చిత్రాలని నిలువరించాలని ఈ మధ్య తెలుగు నిర్మాతల పోరు పెడుతూ ఉండడంతో తనకున్న పెద్ద మార్కెట్ పోతుందేమో అనే దిగులు సూర్యకి పట్టుకుంది. అందుకే తన తమిళ చిత్రాలని తెలుగులోనూ చిత్రీకరించేలా సూర్య ప్లాన్ చేసుకుంటున్నాడు. కామెడీ ట్రాకుల్ని మనవాళ్లతో చేయిండం, కొంతమంది తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్టుల్ని వాడడం వగైరా చేయబోతున్నాడు.
అందులో భాగంగానే రవితేజతో కలిసి ఓ సినిమా చేయాలని సూర్య ప్లాన్ చేసుకుంటున్నాడు. రవితేజ ఉంటే కనుక దానిని స్ట్రైయిట్ సినిమాగానే భావిస్తారనేది అతని ఫీలింగ్. మరి ఈ అతి తెలివితేటలవల్ల అతనికి నిజంగానే ప్రయోజనం సిద్దిస్తుందో లేదో తెలీదు.


Click it and Unblock the Notifications











