మెరీనా తీరంలో...మహేష్ బాబు
చెన్నై : ప్రస్తుతం మహేష్ బాబు..చెన్నై మెరీనా విహారం చేస్తున్నారు. తన తాజా చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు' చిత్రం షూటింగ్ అక్కడ జరుగుతోంది. ప్రస్తుతం చెన్నైలో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. వెంకటేష్, మహేష్‌బాబు హీరోలుగా దిల్ రాజు నిర్మిస్తున్న మల్టీస్టారర్ చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సందర్భంగా కలిసిన మీడియాతో దిల్ రాజు మాట్లాడుతూ...''నిర్మాతగా నా కెరీర్‌లోనే మరిచిపోలేని సినిమా ఇది. వెంకటేష్, మహేష్ లాంటి టాప్ స్టార్స్‌తో మల్టీస్టారర్ మూవీ చేయడం గొప్ప అనుభూతి. భావోద్వేగాల సమ్మేళనం ఈ సినిమా. కచ్చితంగా ఓ ట్రెండ్ సెట్టర్ అవుతుంది. ఒకరి కోసం అందరు, అందరి కోసం ఒకరు.. అనే భావనే వసుధైక కుటుంబంలోని గొప్పదనం. ఆ విషయాన్ని ఓ అందమైన కథగా చెబుతున్నాము''అన్నారు.
దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ.. ...అన్నదమ్ముల అనుబంధానికి అర్థాలెప్పుడో మారిపోయాయి. అమ్మ ప్రేమ నుంచి... నాన్న సంపాదించిన ఆస్తుల వరకూ వాటాలేసుకొనేవాళ్లే అన్నదమ్ములిప్పుడు. షిప్టుల ప్రకారం అమ్మానాన్నల బాధ్యతల్ని పంచుకొంటున్నారు. ఇందుకు భిన్నమైన... ఆప్యాయతానురాగాలే ఆస్తిపాస్తులనుకొనే సోదరుల కథను తెర మీదకు తీసుకొస్తున్నా అని చెప్పారు.
సమంత, అంజలి, ప్రకాష్‌రాజ్, జయసుధ, రోహిణిహట్టంగడి, రావు రమేష్, ఆహుతిప్రసాద్, బ్రహ్మానందం, రమాప్రభ, తనికెళ్ల భరణి, కోట శ్రీనివాసరావు, రవిబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మిక్కీజెమేయర్, కెమెరా: కె.వి.గుహన్, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేశ్, నిర్మాత: దిల్‌రాజు, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల.


Click it and Unblock the Notifications











