ఇంతకంటే నీచం లేదు: ఘాటుగా కమల్ హాసన్ ప్రచారం!

By Bojja Kumar

చెన్నై: తమిళనాడు రాష్ట్ర ఎన్నికల కమీషన్ యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్‌ను ఎన్నికల బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. ఈ మేరకు ఆయన ఎన్నికల కమీషన్ తరుపున ఓటర్లలో చైతన్యం కల్పిస్తున్నారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు పెట్టే ప్రలోభాలకు లొంగవద్దని ప్రచారం చేస్తున్నారు. డబ్బు తీసుకుని ఓటేయడం అంటే నీ ఆత్మగౌరవాన్ని అమ్ముకోవడమే అని, ఇంతకంటే నీచమైన చర్య మరొకటి లేదని ఆయన ప్రచారం చేస్తున్నారు.

ఈ మేరకు ఆయన మాట్లాడిన ప్రసంగాన్ని ఎన్నికల కమీషన్ తమిళం, ఇంగ్లీషులో విడుదల చేసింది. ఆయన ప్రసంగం ఓటర్లలో చైతన్యం కల్పించే విధంగా ఉందని....డబ్బు తీసుకోకుండా, నిజాయితీగా ఓటింగు ప్రక్రియలో పాల్గొనండి అంటూ ఆయన చెబుతున్న మాటలు మంచి ప్రభావం చూపుతాయని అధికారులు అంటున్నారు.

Selling Your Vote Is Like Selling Your Self Respect: Kamal Hassan

వీడియో మెసేజ్‌లో ఆయన మాట్లాడుతూ..'గుర్తుంచుకోండి. మీ ఓటును అమ్ముకోవడం అంటే మీ ఆత్మగౌరవాన్నిఅమ్ముకోవడమే. ఎలాంటి భయం లేకుండా ఓటు వేయండి. ప్రజాస్వామ్యం కోసం ఓటేయండి. చైతన్యంతో ఓటేయండి' అని వ్యాఖ్యానించారు. దీన్ని టీవీలతో పాటు, థియేటర్లలో కూడా ప్రదర్శిస్తున్నారు.

ఆ సంగతి పక్కన పెడితే...ఆయన ప్రస్తుతం తన తాజా సినిమా 'ఉత్తమ విలన్' షూటింగులో బిజీగా గడుపుతున్నారు. ఈ చిత్రానికి రమేష్ అరవింద్ దర్శకత్వం వహిస్తున్నారు. మరో వైపు ఆయన స్వీయ దర్శకత్వంలో నటించిన 'విశ్వరూపం 2' చిత్రం పోస్టు ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X