»   » ‘శ్రీమంతుడు’ తమిళ వెర్షన్ ఆడియో లాంచ్ (ఫోటోస్)

‘శ్రీమంతుడు’ తమిళ వెర్షన్ ఆడియో లాంచ్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు తాజా సినిమా ‘శ్రీమంతుడు' చిత్రాన్ని తమిళంలో కూడా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో ‘సెల్వందన్' అనే టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ‘సెల్వందన్' ఆడియో లాంచ్ వేడుక చెన్నైలో జరిగింది. మహేష్ బాబు చేతు మీదుగా ఆడియో సిడీలు రిలీజ్ చేసారు.

ఈ వేడుకలో దర్శకుడు కొరటాల శివ, మ్యూజిర్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ ఆర్.మాది, ఎఎం రత్నం, జగపతి బాబు, సనమ్ శెట్టి, విజయ్ టీవీ యాంకర్ రమ్య, ధరణి, వివేకా, ఎడిటర్ మోహన్, కెఎస్ రవికుమార్, కలైపులి ఎస్ థాను, రామజోగయ్య శాస్త్రి, కెఇ జ్ఞానవేల్ రాజా తదితరులు పాల్గొన్నారు.


ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ఎలాంటి కట్స్ లేకుండా U/A సర్టిఫికెట్ జారీ చేసింది. 2015 సంవత్సరంలోని విడుదలవుతున్న భారీ చిత్రాల్లో ఇదీ ఒకటి. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మహేష్ బాబు, శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ ఈచిత్రానికి సంగీతం అందించారు.


జగపతి బాబు, బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్, సుకన్య, సంపత్ రాజ్, హరీష్ ఉత్తమన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి, మోహన్ చెరుకూరి సంయుక్తంగా మైత్రి మూవీ మేకర్స్ బేనర్లో...జి మహేష్ బాబు ఎంట్టెన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో కలిసి నిర్మిస్తున్నారు.


ఈ సినిమా కోసం మహేష్ బాబు ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదు. ఆయన నిర్మాణ సంస్థ జి.మహేష్ బాబు ఎంటర్టెన్మెంట్స్ ప్రై.లి, మైత్రి మూవీస్ సినిమా ద్వారా వచ్చిన లాభాలను షేర్ చేసుకుంటాయి. ‘శ్రీమంతుడు' సినిమాకు సంబంధించిన మార్కెటింగ్ విషయాలను మహేష్ బాబు భార్య నమ్రత దగ్గరుండి చూసుకుంటున్నారు.


సెల్వందన్
  

సెల్వందన్

శ్రీమంతుడు తమిళ వెర్షన్ ‘సెల్వందన్' ఆడియో విడుదల చేస్తున్న మహేష్ బాబు.


ఫాలోయింగ్
  

ఫాలోయింగ్

మహేష్ బాబుకు తమిళంలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన గత సినిమాలకు ఇక్కడ మంచి వసూళ్లు సాధించాయి.


దేవిశ్రీ ప్రసాద్
  

దేవిశ్రీ ప్రసాద్

తెలుగుతో పాటు తమిళంలో పాపులర్ అయిన దేవిశ్రీ ప్రసాద్ ఈచిత్రానికి సంగీతం అందించడం మరో ప్లస్ పాయింట్.


ఆడియో
  

ఆడియో

ఆడియో సీడీల ఆవిష్కరణ అనంతరం మహేష్ బాబు ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.


ఎఎం రత్నం
  

ఎఎం రత్నం

ప్రముఖ తమిళ నిర్మాత ఎఎం రత్నంతో ముచ్చటిస్తున్న మహేష్ బాబు.


 


 


Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu