జీవితంలో ఒక్కసారైనా ఆయన్ను కలవాలి.. సెన్సేషనల్ డైరెక్టర్ కామెంట్స్
సామాన్య జనాలకు ఇష్టమున్నట్టుగా సెలెబ్రిటీలకు సైతం కొన్ని ఇష్టాలుంటాయి. మనం అభిమానించినట్టుగా వారు సైతం కొందరు నటీనటులను, హీరోలను ఇష్టపడుతుంటారు. ఒక్కసారైనా మన అభిమాన హీరో, హీరోయిన్లను నటీనటులను కలవాలని కోరుకుంటాం. అయితే ఇదే విధంగా సినీ సెలెబ్రిటీల్లోనూ అలాగా ఉంటుంది. తాజాగా తమిళ సెన్సేషనల్ డైరెక్టర్ సెల్వ రాఘవన్‌కు జీవితంలో ఒక్కసారైనా ఒక నటుడిని కలవాలనే కోరిక ఉందట. ఆ వివరాలేంటో ఓసారి చూద్దాం.

సెన్సేషనల్ మూవీస్..
సెల్వరాఘవన్ చేసే ప్రతీ ఒక్క సినిమా కొత్తగా ఉంటుంది. విభిన్నంగా ఆలోచించడమే ఆయన శైలి. ఆయన సినిమా వస్తుందంటే ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని నమ్మేవారు ఎంతోమంది. యుగానికొక్కడు, 7/g బృందావన కాలనీ, ఆడవారు మాటలకు అర్థాలేవేరులే వంటి ఎన్నో విభిన్న చిత్రాలను తెరకెక్కించాడు.

డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడు..
అయితే ఎన్నో అంచనాలతో వచ్చిన ఎన్జీకే చిత్రం డిజాస్టర్‌గా మిగిలింది. సూర్య, సాయి పల్లవి వంటి టాలెంటెడ్ నటులతో భారీగా తెరకెక్కించిన సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిలబడింది. దీంతో కాస్త డీలా పడ్డ రాఘవన్.. మరో కొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులను పలకరించేందకు రెడీ అవుతున్నాడు.

ధనుష్‌తో ప్రాజెక్ట్..
2006లో ధనుష్‌తో చేసిన పుదుపెట్టై అప్పట్లో ఘన విజయాన్ని నమోదు చేసింది. సొంత తమ్ముడైన ధనుష్‌కు బ్లాక్ బస్టర్ ఇచ్చిన సెల్వ రాఘవన్.. ఈ చిత్రానికి సీక్వెల్ రెడీ చేసినట్టు తెలుస్తోంది. ఈ మూవీ విశేషాలు చెబుతూ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక సంగతులు వెల్లడించాడు.

ఒక్కసారైనా ఆయన్ను కలవాలి..
సెల్వ రాఘవన్.. కమెడియన్ గౌండమనిని జీవితంలో ఒక్కసారైనా కలవాలని అనుకుంటున్నట్టు తెలిపాడు. ఆయన కామెడీ టైమింగ్ చాలా బాగుంటుందని, ఆయన నటించిన సినిమాలన్నీ చూస్తానని, ఓ సినిమా ఆయనతో చేయాలని అనుకుంటున్నట్టు పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications











