అసెస్టెంట్ ని లైన్ లో పెట్టిన వెంకటేష్ సూపర్ హిట్ డైరక్టర్
వెంకటేష్ తో ఆడువారి మాటలకు అర్దాలు వేరులే వంటి సూపర్ హిట్ చిత్రం రూపొందించిన తమిళ డైరక్టర్ సెల్వ రాఘవన్ గుర్తుండే ఉంటారు. తన చిత్రాల్లో నటించిన సోనియా అగర్వాల్ అనే హీరోయిన్ ని ప్రేమించి పెళ్ళి చేసుకున్న ఆయన ఆ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చారు. అనంతరం మరో హీరోయిన్ తో ఎఫైర్ నడిపాడు. ఇప్పుడదీ బెడిసి కొట్టింది. తాజాగా తన దగ్గర అసెస్టెంట్ డైరక్టర్ గా పనిచేస్తున్న గీతాంజలి అనే ఆమెను లైన్ లో పెట్టాడు. ఆమె కూడా సెల్వ ను బాగా ఇష్టపడుతోంది. ఆమె ఇంట్లో వారు కూడా వీవి పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీరిద్దరి ఎంగేజ్ మెంట్ ఫిబ్రవరిలో జరగనుంది. జూన్ లో పెళ్లికి ముహూర్తం ఖరారు చేయనున్నారు. గీతాంజలి రాకతోనే తన జీవితంలో ఆనందం వచ్చిందని, నిజమైన ప్రేమంటే ఏమిటో గీతాంజలి సాంగత్యంలోనే తెలుసుకున్నానని సెల్వరాఘవన్ చెబుతున్నాడు. గీతాంజలితో తన ప్రేమ, పెళ్లి చిరకాలం ఉండిపోతాయని అంటున్నాడు. ప్రతీసారి సెల్వ ఇలాగే చెపుతున్నాడని ఆయన మాజీ ప్రియురాళ్ళు గొణుక్కుంటున్నారు. ప్రస్తుతం సెల్వరాఘవన్, రానా కాంబినేషన్ లో తెలుగులో ఓ చిత్రం రూపొందనుంది.


Click it and Unblock the Notifications











