»   » వారిద్దరి మధ్య చిచ్చు పెట్టి ఎంజాయ్ చేస్తున్నా!

వారిద్దరి మధ్య చిచ్చు పెట్టి ఎంజాయ్ చేస్తున్నా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

శ్రీరాఘవ, సోనియా అగర్వాల్ కాపురంలో చిచ్చుపెట్టి వారిద్దరూ విడాకులు తీసుకోవడానికి ఆండ్రియా కారణమైందన్నది కోలీవుడ్ సమాచారం. ఆండ్రియా తన అందచందాలతో శ్రీరాఘవను కొంగుకు కట్టేసుకుందట! వీళ్లిద్దరి మధ్యా కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. 'యుగానికి ఒక్కడు" లో ఓ మంచి పాత్ర ఇచ్చి ఎంకరేజ్ చేశాడు. ఆ సినిమాలో సోనియాను మైమరపించింది కాబోలు!

ఆడ్రియా లేకుండా సినిమా తీయడం లేదు. శ్రీ రాఘవ తర్వాత మూవీలో కూడా ఆండ్రియానే బుక్ చేశాడు. రాణా హీరోగా తెలుగు తమిళంలో ఓ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. 'ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే" తర్వాత శ్రీరాఘవ తీస్తున్న డైరెక్ట్ తెలుగు మూవీ ఇదే. ఇందులో హీరోయిన్ గా ఆండ్రియాను సెలెక్ట్ చేశాడట! ఆండ్రియా సెట్ మీద లేకపోతే మెగాఫోన్ పట్టలేడు కాబోలు!

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu