రాణా కాకుండా వేరే హీరోగా సెల్వరాఘవన్ చిత్రం ప్రారంభం
రాణా హీరోగా సెల్వరాఘవన్ తో ప్రారంభం కానున్న చిత్రం ఆగిపోయిందని,గౌతమ్ మీనన్ తో చిత్రం ప్రారంభమయిందంటూ ఆ మధ్య వార్తలు వచ్చన సంగతి తెలిసిందే. అయితే వెంటనే రాణా స్పందించి తమ కాంబినేషన్ చిత్రం ఆగలేదని, అతి త్వరలోనే ప్రారంభం కానుందంటూ ట్విట్టర్ లో సమాధానమిచ్చారు. అయితే సెల్వరాఘవన్ తాజాగా నిన్న(28 జూన్, 2010) చెన్నై లో షూటింగ్ ప్రారంభమయింది. తన తమ్ముడు ధనుష్ హీరోగా ఈ చిత్రం ప్రారంభమయింది. ఆ చిత్రం టైటిల్ మలై నీర్తు మయక్కం. ఈ సందర్భంగా సెల్వరాఘవన్ మాట్లాడుతూ...ఇది నా ఎనిమిదవ చిత్రం, ధనుష్ తో నాలుగవ చిత్రం. ఇప్పటికీ నాకు మొదటిసారి డైరక్షన్ చేస్తున్నట్లుగా టెన్షన్ గా ఉంది. ఈ చిత్రంలో ఆండ్రియా హీరోయిన్ గా చేస్తోంది. జి.వి ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రామజీ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఇక ధనుష్ మాట్లాడుతూ..మళ్ళీ సెల్వతో పనిచేస్తూంటే స్కూల్ కి మళ్ళీ వెళ్తున్న ఫీలింగ్ కలుగుతోంది. ఈ చిత్రంలో నేను చేసే పాత్ర ఇంతకుముందు చేయనది.ఇది నాకు కొత్త అవతారం అన్నారు. ఇవన్నీ చూస్తూంటే రాణాతో చిత్రం ఇప్పుడప్పుడే లేదనిపిస్తోంది కదూ..


Click it and Unblock the Notifications











