అల్లు అర్జున్ ని కాదని రానా ని తీసుకుంటున్నారు??
హైదరాబాద్ : అల్లు అర్జున్, సెల్వరాఘవన్ కాంబినేషన్ లో ఆ మద్యన ఓ చిత్రం ప్లాన్ చేసారు. అయితే అది మెటీరియలైజ్ కాలేదు. ఇప్పుడు అదే ప్రాజెక్టుని దగ్గుపాటి రానా తో తెరకెక్కిస్తున్నట్లు కోలీవుడ్ టాక్. అయితే దగ్గుపాటి రానా తో తాను చిత్రం చేస్తున్నట్లు సెల్వ రాఘవన్ ట్విట్టర్ లో తాజాగా ట్వీట్ చేసారు. ఆ ట్వీట్ లో..." నా తదుపరి చిత్రం దగ్గుపాటి రానాతో.. అది బై లింగ్వువల్. అవును...ఈ చిత్రానికి యవన్ శంకర్ రానా సంగీతం అందిస్తున్నారు. ప్రెండ్స్ తిరిగి కలిసి పని చేస్తున్నాం. హ్యావ్ ఫన్ !" అన్నారు.
'యుగానికొక్కడు', 'ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే' చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ త్వరలో దగ్గుబాటి రాణా హీరోగా ఓ చిత్రాన్ని రూపొందించ బోతున్నారు. చాలా కాలం క్రితమే వీరి కాంబినేషన్ అనుకున్నప్పటికీ అనుకోనికారణాల వల్ల ఇప్పటి వరకు ఆచరణ సాధ్యం కాలేదు. మళ్లీ త్వరలో ఈ ప్రాజెక్టు ట్రాక్ మీదకు రాబోతోంది. ప్రస్తుతం సెల్వరాఘవన్ 'ఇరండం ఉలగం' చిత్రం షూటింగులో బిజీగా గడుపుతున్నాడు. ఈ చిత్రం తెలుగులో 'బృందావనంలో నందకుమారుడు'గా విడుదల కాబోతోంది. ఈచిత్రంలో ఆర్య, అనుష్క జంటగా నటిస్తున్నారు. హారిష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు.
ఈ చిత్రం తర్వాత రాణా-సెల్వరాఘవన్ చిత్రం ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. ప్రస్తుతం రాణా క్రిష్ దర్శకత్వంలో 'కృష్ణం వందే జగద్గురుమ్'చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటి వరకు కెరీర్లో సరైన హిట్ లేని రాణా హిట్ కోసం తహతహలాడుతున్నాడు. ఎంతో నమ్మకాలు పెట్టుకుని చేసిన వర్మ డిపార్టమెంట్ చిత్రం డిజాస్టర్ కావటం రానాని బాగా నిరాశపరిచింది. ఈ నేపధ్యంలో దర్శకులు విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
ఇక అనూష్క తో సెల్వ రాఘవన్ చేస్తున్న బృందావనంలో నందకుమారుడు భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. ఇరాండం ఉలగం టైటిల్ తో ఈ చిత్రం తమిళంలో విడుదల కానుంది. ఇందులోని ఓ పాత్ర కోసం అనూష్క రీసెంట్ గా మార్షిల్ ఆర్ట్స్ సైతం నేర్చుకున్న సంగతి తెలిసిందే. ఇందులో రాధిక ఓ కీలకపాత్రను పోషిస్తోంది. తమిళంలో ఈ చిత్రాన్ని యూ.టీవి మోషన్ పిక్చర్స్ వారు సమర్పిస్తున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని ప్రసాద్ .వి.పొట్లూరి అందిస్తున్నారు. ఇందులో అనూష్క ద్విపాత్రాభినయం చేస్తోంది. ఓ రేంజిలో ఈ చిత్రం అద్బుతంగా రూపొందుతోందని చెన్నై వర్గాల టాక్.


Click it and Unblock the Notifications











