రిచాను గోకుతున్న ప్లేబాయ్ డైరెక్టర్!
తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ గుర్తున్నాడా? అదేనండీ 7జి బృందావన్ కాలనీ సినిమాలో హీరోయిన్ గా నటించిన సోనియా అగర్వాల్ తో కొంతకాల డేటింగ్ చేసి ఆపై ఆమెను పెళ్లి చేసుకున్నాడే...అతడే. పెళ్లయిన కొన్నాళ్లకే ఇద్దరి పెళ్లి బంధం తెగిపోయింది. కాదు..కాదు సోనియా అగర్వాలే తెంచేసుకుంది. సెల్వరాఘవన్ ఇతర హీరోయిన్లతో 'సం"బంధాలు నడుపుతుండటం సహించలేకనే, అతనితో కలిసి ఉండి ఆ మనో వేధనను అనుభవించడం కంటే విడిపోయి మనశ్శాంతిగా జీవించడం మేలనే ఉద్దేశ్యంతోనే సోనియా అతనికి దూరంమైందని ఆ మధ్య వార్తలు వినిపించాయి. తన సినిమాల్లో నటించే హీరోయిన్లను ఏదో రకంగా మాయ చేసి సంథింగ్ సంథింగ్ చేసి తన కోరిక తీర్చుకుంటాడనే పుకార్లు కూడా సెల్వరాఘవన్ పై ఉన్నాయి. కొందరైతే అతన్ని ప్లేబాయ్ డైరెక్టర్ అని పిలుస్తుంటారు.
తాజాగా...సెల్వరాఘవ్ గురించిన మరో హాట్ న్యూస్ వినిపిస్తోంది. హీరోయిన్ రీచా గంగోపాధ్యాయ్ ని గోకుతున్నాడని, ఆమోతో ఎఫైర్ పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని తమిళ సినీ జనాలు గుసగులాడుకుంటున్నారు. ప్రస్తుతం రీచా సెల్వ దర్శకత్వంలో 'మయక్కమ్ ఎన్న" అనే సినిమాలో నటిస్తోంది. సౌత్ లో పెద్దగా విజయాలు లేని రీచా ఈ సినిమాతోతైనా మంచి స్టార్ ఇమేజ్ ను సంపాదించుకోవాలని చూస్తుంది. రీచా అవసరాన్ని గ్రహించిన ఈ దర్శకుడు తన అవసరం తీర్చుకోవడానికి ఆమెను వాడుకుంటున్నాడని చర్చించుకుంటున్నారు. చూద్దాం...రీచా పరిస్థితి ఏం కాబోతోందో?


Click it and Unblock the Notifications











