అదిగో పెళ్ళి- ఇదిగో విడాకులు
సెల్వరాఘవన్ మొదట సోనియాను 2002 కలుసుకొన్నాడు. 'కాదల్ కొండెన్" సినిమా తమిళ్ లో 2003 జూలైలో విడుదలై సెన్షేషనల్ హింట్ అయింది. ఈ సినిమాలో సెల్వరాఘవన్ బ్రదర్ ధనుష్ సరసన సోనియా నటించింది. దీనితో సెల్వరాఘవన్ ప్రేమలో పడ్డ సోనియా 4 ఏళ్ల తర్వాత 15 డిసెంబర్ 2006లో చెన్నై ఎగ్ మోర్లోని రాజా ముత్తయ్య చెట్టియ్యార్ హాల్ లో వివాహం జరిగింది. వీరి వివాహానికి సూపర్ స్టార్ రజనీకాంత్ మరియు కోలీఉడ్ స్టార్స్ చాలా మంది హజరయ్యారు.
కథానాయిక సోనియా అగర్వాల్ దర్శకుడు సెల్వరాఘవన్ ప్రేమించి పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే అయితే వీరి వివాహం జరిగి రెండేళ్ళ కూడా కాక ముందే, గత కొంత కాలంగా సోనియా, సెల్వరాఘవన్ ల మధ్య అంతగా సఖ్యత లేదని పరిశీలకులు అంటున్నారు. దానికి కారణం సెల్వరాఘవన్ దర్శకత్వం వహించిన 'ఆయిరత్తిల్ ఓరువన్" లో ఒక కథానాయికగా నటించిన ఆండ్రియా అని కూడా వినికిడి. కారణాలు ఏమైవుంటాయి ఆండ్రియాతో సెల్వరాఘవన్ అఫయిర్ ఉందని తెలుసుకొన్న సోనియా, ఒక రోజు హైదరాబాద్ లో ష్యూటింగ్ జరుగుతున్నప్పుడు సెట్లో ఆండ్రియాను అందరి ముందు కొటిందట. అనంతరం వీరి మధ్య మాటా మాటా పెరిగా మనస్ఫర్థాలకు దారి తీసింది. దీన్నే కారణంగా పెట్టుకొని, సెల్వరాఘవన్, సోనియా విడిపోవాలనుకొన్నారు. వీరిద్దరినీ కలపడానికి ప్రెండ్స్, బందవులు, సూపర్ స్టార్ రజనీతో సహ ప్రయత్నాలు జరిపి విఫలురైయ్యారు.
ఇటీవలే ఈ ఇద్దరూ ఒక అవగాహనకు వచ్చి విడాకులు తీసుకోవాలని నిర్ణంయించుకున్నారట. విడాకుల కొరకు ఎగ్ మోర్ కోర్ట్ క్యాంపస్ లోని ఫ్యామినలీ కోర్టులో విడాకులకు అప్లై చేనారట.


Click it and Unblock the Notifications