ఖుష్బూపై కోడిగుడ్లతో దాడి..పెళ్ళికి ముందు సెక్స్, కోర్టులో హాజరు, ఏం జరిగింది!
Recommended Video

80 వ దశకంలో పలువురు దక్షణాది అగ్రహీరోయిన్లకు వలే ఖుష్బూ కూడా యువతకు కలల హీరోయిన్. టాలీవుడ్ లో కూడా కొన్ని చిత్రాల్లో నటించి మెప్పించింది. కాగా సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తోంది. పదేళ్ల క్రితం విడుదలైన మెగాస్టార్ స్టాలిన్ చిత్రంలో నటించిన ఖుష్బూ, ఆ తరువాత నటించిన తెలుగు సినిమా అజ్ఞాతవాసి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఈ చిత్రంలో ఖుష్బూ సవతి తల్లి పాత్రలో నటించింది. ఈ చిత్రం ప్రేక్షుకులని మెప్పించలేకపోయింది. ఇదిలా ఉండగా 2005 లో ఖుష్బూపై నమోదైన కేసు ఒకటి ఈమెని వేధిస్తోంది. ఈ కేసు విచారణలో భాగంగా ఖుష్బూ బుధవారం కోర్టులో హాజరయ్యారు.

యువతకు కలల రాణి
ఖుష్బూ 80వ దశకంలోనే దక్షణాది యువతకు కలల రాణిగా నిలిచింది. ఖుష్బూ అందం అభినయం అప్పట్లో యువతని బాగా ఆకట్టుకున్నాయి. ఖుష్బూ నటించిన తొలి తెలుగు చిత్రం కలియుగ పాండవులు.

సెకండ్ ఇన్నింగ్స్ లోనూ జోరు
ఖుష్బూ తన సెకండ్ ఇన్నింగ్స్ లో నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తున్నారు. స్టాలిన్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవికి అక్కగా నటించిన సంగతి తెలిసిందే.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సవతి తల్లిగా
ఏడాది ఆరంభంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం అజ్ఞాతవాసి విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఖుష్బూ పవన్ కళ్యాణ్ కు సవతి తల్లిగా నటించారు.

ఖుష్బూని వేధిస్తున్న ఒకప్పటి కేసు
ఖుష్బూపై తమిళనాడులో 2005 లో ఓ కేసు నమోదలైంది. ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఈ కేసు నమోదు చేసారు. ఇప్పటికి ఆ కేసు కోర్టులో నడుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో బుధవారం ఆమె కోర్టులో హాజరయ్యారు.

పెళ్ళికి ముందే సెక్స్
ప్రస్తుతం పలువురు ప్రముఖులు స్త్రీల స్వేచ్ఛ గురించి భిన్న కామెంట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. 2005 లోనే ఖుష్బూ దీని గురించి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆడా, మగా ఇష్టంతో పెళ్ళికి ముందు సెక్స్ పాల్గొంటే తప్పులేదు. అంత మాత్రాన ఆడవారి శీలం పోదు. శీలం అనేది మనసుకు సంభందించినది అని ఖుష్బూ 2005 లో ఓ ఇంటర్వ్యూ లో అన్నారు.

రేగిన వివాదం
ఖుష్బూ వ్యాఖ్యలతో అప్పట్లో పెనువివాదమే రేగింది. ఖుష్బూ ప్రయాణిస్తున్న వాహనంపై కోడిగుడ్లు, టమోటాలతో దాడిచేశారు. ఈ చర్యల్ని ఖండిస్తూ ఖుష్బూ కేసు నమోదు చేసారు. ఈ దాడిలో భాగంగా మొత్తం 41 మందిపై కేసు నమోదైంది.

కోర్టుకు ఖుష్బూ
ఈ కేసులో భాగంగా ఖుష్బూ బుధవారం కోర్టు ముందు హాజరయ్యారు. ఖుష్బూ కూడా హాజరు కావాలని కోర్టు ఇటీవల నోటీసులు పంపిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











