twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఒళ్ళు దగ్గర పెట్టుకో.. నీ సీన్స్ గురించి మాట్లాడితే ముఖం ఎక్కడ పెట్టుకుంటావు!

    |

    తమిళ సీనియర్ హీరోయిన్ కస్తూరి తరచుగా వార్తల్లో నిలుస్తోంది. పలు వివాదాల్లో ఆమె కేంద్ర బిందువుగా మారుతోంది. నాలుగు పదుల వయసులో కూడా గ్లామర్ రోల్స్, స్పెషల్ సాంగ్స్ చేస్తూ కస్తూరి హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసే కస్తూరి మరోమారు వివాదంలో చిక్కుకుంది. తమిళులు ఆరాధ్య దైవంగా భావించే ఎంజీఆర్, సీనియర్ నటి లత గురించి కస్తూరి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో కోల్ కతా జట్టుని ఎంజీఆర్, లతతో పోలుస్తూ కస్తూరి ఘాటు వ్యాఖ్యలు చేసింది. దీనితో కస్తూరిపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.

     వాళ్ళిద్దరి రొమాన్స్

    వాళ్ళిద్దరి రొమాన్స్

    ఇటీవల్ జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో కోల్ కతా జట్టు చాలా నెమ్మదిగా బ్యాటింగ్ చేసింది. దీని గురించి కస్తూరి సోషల్ మీడియాలో ఎంజీఆర్, సీనియర్ నటి లతని అవమానించేలా వ్యాఖ్యలు చేసింది. వీళ్ళ బ్యాటింగ్ చూస్తుంటే పల్లాండు చిత్రంలో లతని వ్యాదియర్ తడిమినట్లుగా ఉంది అంటూ కామెంట్ చేసింది. ఇక్కడ వ్యాదియర్ అంటే ఎంజీఆర్. ఎంజీఆర్ ని పరోక్షంగా అవమానించేలా వ్యాఖ్యానించిన కస్తూరిపై అభిమానులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు.

     ఒళ్ళు దగ్గర పెట్టుకో

    ఒళ్ళు దగ్గర పెట్టుకో

    కస్తూరి వ్యాఖ్యలపై లత స్పందించారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నీవు ఎలాంటి చిత్రాల్లో నటించావో, ఎలాంటి సన్నివేశాలు చేశావో మాకు తెలియదా.. వాటి గురించి మాట్లాడితే నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటావు అంటూ లత ఘాటుగా బదులిచ్చారు. నీకు నాగరికత, అణుకువ చాలా అవసరం. ఎంజీఆర్ గారిని, నన్ను విమర్శించే స్థాయి అసలు నీది. నీ పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుంది అంటూ లత కస్తూరికి వార్నింగ్ ఇచ్చారు.

     తెలుగు చిత్రాలు

    తెలుగు చిత్రాలు

    కస్తూరి ఇటీవల ఘాటుగా రొమాన్స్ ఉన్న చిత్రాల్లో నటిస్తోంది. గత ఏడాది తమిళ్ పాదం 2 చిత్రంలో కస్తూరి చేసిన స్పెషల్ సాంగ్ తమిళ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా నిలిచింది. తెలుగులో కస్తూరి అన్నమయ్య, చిలక్కొట్టుడు లాంటి చిత్రాల్లో నటించింది. కస్తూరి 1991లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. తెలుగు, తమిళ, మలయాళీ భాషల్లో నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

    హీరో కార్తీ ముందే సెటైర్లు

    హీరో కార్తీ ముందే సెటైర్లు

    ఇటీవల ఓ మీడియా సమావేశంలో కస్తూరి హీరో కార్తీ ముందే ఆయన తండ్రిపై సెటైర్లు వేసింది. కార్తీ తండ్రి శివకుమార్ అభిమానుల ఫోన్లు కిందపడేయడం గురించి మాట్లాడింది. వేదికపైనే కస్తూరి వ్యాఖ్యలకు కార్తీ కౌంటర్ ఇచ్చారు. మొబైల్స్ ప్లాష్ వలన కంటి సమస్య ఎదురవుతుంది. సెలెబ్రిటీలు కూడా మనుషులే. ప్రతి సందర్భంలోనూ సెల్ఫీ కోసం ప్రయత్నించకూడదు అంటూ కస్తూరికి కార్తీ సమాధానం ఇచ్చాడు.

    English summary
    Senior Actress Latha gives strong warning to Kasthuri over her comments on MGR
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X