నయనతారపై పగ తీర్చుకున్న హీరోయిన్.. సింగిల్‌ పోస్ట్‌తో చెంప చెళ్లు!

మేల్ డామినేటింగ్ ఇండస్ట్రీలో దాదాపు రెండు దశాబ్ధాలుగా మహారాణిగా వెలుగొందుతున్నారు నయనతార. విలక్షణ నటిగా, లేడీ సూపర్‌స్టార్‌గా , ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా నయనతార నిలిచారు. స్టార్ హీరోలను మించి ఆమె సినిమాలు వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. 40 ప్లస్‌లోనూ చెక్కు చెదరని గ్లామర్‌తో కుర్ర హీరోయిన్‌లకు పోటీ ఇస్తున్నారు నయనతార. అయితే ఇదంతా నాణేనికి ఓ వైపు మాత్రమే.. వివాదాలతోనూ ఆమె అంతే వార్తల్లో నిలిచారు.

2003లో మనస్సినక్కరే అనే మలయాళ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన నయనతారకు పీ. వాసు దర్శకత్వంలో తెరకెక్కిన చంద్రముఖి సినిమా బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత ఆమె వెనుదిరిగి చూసుకునే అవకాశం రాలేదు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటిస్తూ లేడీ సూపర్‌స్టార్‌గా తిరుగులేని స్థానంలో నిలిచారు. కెరీర్ తొలినాళ్లలో శింబు, ప్రభుదేవాలతో ప్రేమ విఫలం కావడంతో డిప్రెషన్‌లోకి వెళ్లిన నయనతార తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యారు. వరుసపెట్టి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ స్టార్లను మించిన కలెక్షన్స్‌తో బాక్సాఫీస్‌ను వణికించారు.

Senior Actress Meena retaliated to Lady super star Nayanthara

ఆమె ఎంత అడిగితే అంత ఇవ్వడానికి దర్శక నిర్మాతలు రెడీగా ఉన్నారంటే నయన్ రేంజ్ అర్ధం చేసుకోవచ్చు. యువ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమలో పడిన నయనతార 2022 జూన్ 9న ఆయనను పెళ్లాడారు. చాలా మంది నయనతారకు పొగరని, యాటిట్యూడ్ చూపిస్తుందని .. షూటింగ్‌లకు ఆలస్యంగా వస్తుందని, ప్రమోషన్స్‌లో పాల్గొనదనే విమర్శలు ఆమె కెరీర్‌పై మచ్చలా మారాయి. అయినప్పటికీ నయన్ డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. ఇక ఇటీవల ధనుష్ జరిగిన వివాదం కోర్టు వరకు వెళ్లి చిత్ర పరిశ్రమలో కలకలం రేపింది.

తాజాగా నయనతార మరో వివాదంలో ఇరుక్కుంది. సీనియర్ నటి మీనాను ఆమె అవమానించినట్లుగా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఇటీవల సుందర్ సీ దర్శకత్వంలో సెట్స్ మీదకి వెళ్లిన మూకుతి అమ్మన్ 2 సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ ఈవెంట్‌కు నయనతార హాజరయ్యారు. అయితే కెరీర్‌లోనే తొలిసారిగా ఓ పూజా కార్యక్రమానికి హాజరుకావడం ఇదే తొలిసారి . దీంతో చిత్ర సీమ షాకైంది. ఇదే వేదికపై సీనియర్ హీరోయిన్లు మీనా, ఖుష్బూలు కూడా ఉన్నారు. ఈ సమయంలో నయన్ ఆటిట్యూడ్ చూపించారని మీనాను అవమానించినట్లుగా కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఖుష్బూ, మీనాలు ఒకేసారి స్టేజ్ మీదకు రాగా.. ఖుష్బూనీ హగ్ చేసుకున్న నయనతార.. మీనాను కనీసం పలకరించకలేదు. ఇద్దరూ పక్కనే ఉన్నప్పటికీ మాట్లాడుకోలేదు. సీనియర్ నటి , వయసులో పెద్ద అన్న గౌరవం కూడా లేకుండా నయన్ .. మీనాను ఏమాత్రం పట్టించుకోలేదని నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ క్రమంలో మీనా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. తన ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో గొర్రెల మధ్యలో ఉన్న సింహం ఫోటోను షేర్ చేసి.. గొర్రెల గురించి సింహం ఏమనుకుంటుంది , తన గురించి సింహం ఏం చెబుతుంది , దేని గురించి పట్టించుకోదు అంటూ రాసుకొచ్చింది. ఇది పరోక్షంగా నయనతారను ఉద్దేశించేనంటూ కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. మరి దీనిపై నయన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

More from Filmibeat

Read more about: meena nayanthara
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X