దర్శకుడిపై మండిపడ్డ పవన్ అత్త
ఒకదశలో అమ్మాయిలకు ఐకాన్‌గా పేరు పొందిన నదియా ఆపై వివాహంతో వెండితెరకు దూరమైంది. 'ఎమ్.కుమరన్ సన్ ఆఫ్ మహాలక్ష్మి'తో జయం రవి తల్లిగా రీఎంట్రీ ఇచ్చింది. అపై వరుసగా సహాయనటి పాత్రల్లో కనిపిస్తోంది. ప్రస్తుతం ఆమె పవన్ కళ్యాణ్ చిత్రం అత్తారింటికి దారేదిలో అత్త పాత్ర చేస్తోంది. సమంతకు తల్లిగా కనపడనుంది.
ఇటీవల నదియాను ఓ మలయాళ దర్శకుడు సంప్రదించి హీరో తల్లిగా 60 ఏళ్ల వృద్ధురాలి పాత్రలో నటించాలని కోరాడట. నదియా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
'నేను మీ కంటికి వృద్ధురాలిలా కనిపిస్తున్నానా? డబ్బు ఇస్తే ఏ పాత్రలోనైనా నటిస్తానని ధీమానా' అంటూ చివాట్లు పెట్టిందట. '60 ఏళ్ల వయసున్న నటీమణులు ఎందరో ఉన్నారు. వారికి ఆ పాత్ర ఇవ్వండి' అంటూ కోపంలోనే సలహా కూడా ఇచ్చిందని వినికిడి.
నదియా 1988 లో 'బజార్ రౌడీ' సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయం అయింది. ఆమె పెళ్లి తర్వాత తెలుగు తెరకు దూరమై మళ్లీ మిర్చి చిత్రంలో దర్శనం ఇచ్చింది.


Click it and Unblock the Notifications












