స్టార్ హీరో చేసిన పనిని బట్టబయలు చేసిన హీరోయిన్.. ఆ చేదు సంఘటన గుర్తు చేసుకుంటూ షాకింగ్ కామెంట్స్

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ఈ మధ్య తరుచుగా వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా జరిగిన ఇండియన్ 2 సెట్ ప్రమాదం, దానిపై విమర్శలు, మృతుల కుటుంబాలకు కోటి రూపాయల విరాళాన్నిప్రకటించడం ఇలా ఏదో ఒక రకంగా నిత్యం వార్తల్లో ఉంటున్నాడు. తాజాగా కమల్ హాసన్‌పై సీనియర్ హీరోయిన్ సంచలన కామెంట్స్ చేసింది. ఆ వివరాలేంటో ఓసారి చూద్దాం.

నాటి చిత్రంలోని ఆ సీన్..

నాటి చిత్రంలోని ఆ సీన్..

కె. బాల చందర్‌ దర్శకత్వంలో 1986లో 'పున్నగై మన్నన్‌' సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కమల్‌ హాసన్‌, రేఖల హీరో హీరోయిన్లుగా నటించారు. కాగా సినిమాలో కమల్‌, రేఖల మధ్య ఒక ముద్దుసన్నివేశం ఉంటుంది. అయితే రేఖ16 ఏళ్ల వయసులో ఆమె అనుమతి లేకుండానే సినిమాలో ఈ సన్నివేశం చిత్రీకరించినట్లు తెలుస్తోంది.

 చెప్పడానికి విసుగ్గా ఉంది..

చెప్పడానికి విసుగ్గా ఉంది..

ఇక ఇదే విషయమై సీనియర్‌ నటి రేఖ తాజాగా స్పందిస్తూ.. తాను ఈ విషయం గురించి ఇప్పటికే వంద సార్లు చెప్పానని కాస్త విసుక్కుంది. డైరెక్టర్‌ బాలచందర్‌ తనకు తెలియకుండానే సన్నివేశాన్ని చిత్రీకరించారని చెప్పుకొచ్చింది. మళ్లీ మళ్లీ అదే ప్రశ్న అడుగుతుంటే నాకు సమాధానం చెప్పడానికి విసుగ్గా ఉందని చెప్పుకొచ్చింది. కథలో బావోద్వేగం నింపడం కోసం ముద్దు సన్నివేశం పెట్టినట్లు ఆ షాట్‌ చిత్రీకరణ తర్వాత నాకు చెప్పారు.

క్షమాపణలు కూడా చెప్పలేదు..

క్షమాపణలు కూడా చెప్పలేదు..

షూటింగ్‌ ముగిసిన తర్వాత అప్పటి అసోసియేట్‌ డైరెక్టర్‌లుగా ఉన్న సురేశ్‌ కృష్ణ, వసంత్‌ల దగ్గర ముద్దు విషయంపై గురించి అడిగానని, తన అనుమతి లేకుండా ఎందుకు చిత్రీకరించారని ప్రశ్నించానని తెలిపింది. దానికి వారు ఒక చిన్న పిల్లను ముద్దు పెట్టుకుంటే తప్పేం కాదని వారు అన్నట్లు తెలిపింది. ఆ షాట్‌ ముగిసిన తర్వాత డైరెక్టర్‌ బాలచందర్‌, కమల్‌ హాసన్‌లు ఎలాంటి క్షమాపణలు చెప్పలేదని పేర్కొంది.

Recommended Video

#Indian2 Sets Video : Kamal Haasan's 'Bharateeyudu 2' Sets Crane Mishap | Filmibeat Telugu
క్షమాపణలు చెబితే చెప్పొచ్చు..

క్షమాపణలు చెబితే చెప్పొచ్చు..

సినిమా విజయాన్ని సాధించడం.. మంచి అవకాశాలు రావడంతో ఈ విషయాన్ని అందరూ మరిచిపోయారని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఆ సినిమా తీసిన డైరెక్టర్‌ కె.బాలచందర్‌ మన మధ్య లేరనీ. కమల్‌ హాసన్‌తో పాటు సినిమా యూనిట్‌ మాత్రమే ఉన్నారని మాట్లాడుకొచ్చింది. అయినా వారికి క్షమాపణ చెప్పాలనిపిస్తే చెప్పొచ్చని.. లేదంటే లేదని పైకి మళ్లీ మరో రాగం అందుకుంది. ఎందుకంటే ఇదంతా ఎప్పుడో జరిగిపోయిన విషయమని.. మళ్లీ ఇప్పుడు ఈ అంశం లేవనెత్తడం తనకు ఇష్టం లేదని చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X