twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాయుడిగారితో నాది 45 ఏళ్ల పరిచయం

    By Srikanya
    |

    చెన్నై: రామానాయుడు దేశం గర్వించదగ్గ నిర్మాత. ఆయన ప్రస్థానం మొదలైంది మాత్రం చెన్నపురిలోనే. ఆయనతో ఇక్కడ ఎంతో మందికి ఆత్మీయానుబంధం ఉంది. ఆయన లేరన్న వార్త చెన్నపురిలోని తెలుగువారికి దిగ్భ్రాంతి కలిగించింది. బాధాతప్త హృదయులైన పలువురు సినీప్రముఖులు ఆయనతో తమకున్న అనుబంధాన్ని మీడియాతో పంచుకున్నారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్‌ మాట్లాడుతూ... నాయుడిగారితో నాది 45 ఏళ్ల పరిచయం. ఆయన నిర్మించిన 'మండే గుండెలు' సినిమాకు నేను పంపిణీదారుడైతే, నేను నిర్మించిన 'కాలేజీ బుల్లోడు' సినిమాను ఆయన పంపిణీదారుడిగా విడుల చేసి పెట్టారు. ఆయనతో నాకు ఎంతో ఆత్మీయానుబంధం ఉంది. 135 సినిమాలు నిర్మించిన ఆయన నిర్మాతల లోకానికి ఒక దేవుడు లాంటివారు. సినిమా నిర్మాత ఎలా ఉండాలో ఆయన్ను చూసి నేర్చుకోవాలి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అన్నారు.

    senior producers about D. Ramanaidu

    మరో ప్రముఖ నిర్మాత మురారి మాట్లాడుతూ... నిర్మాతగా ఎవరైనా ఉండొచ్చు. కానీ రామానాయుడు లాంటి నిర్మాతగా వ్యవహరించడం చాలా కష్టం. నిత్యం సినిమాపైనే ధ్యాస. ఆయన సినిమా కోసం పనిచేసే లైట్‌మెన్‌ నుంచి అగ్రహీరో వరకు ప్రతి ఒక్కరినీ సమానంగా చూసుకుంటారు. అప్పుడూ ఇప్పుడూ గెలుపోటములను సమానంగా చూసే నిర్మాతలు ఏ ఒక్కరూ లేరు. కానీ ఆయన మాత్రం పరాజయాలను అస్సలు పట్టించుకోరు. గెలిచామని పొంగిపోరు. కోలుకోలేని ఫ్లాపులు వచ్చినా.. నిలబడి విజయం సాధించడమే.. రామానాయుడు నైజం. సాటి నిర్మాతగా ఆయనంటే నాకు చాలా గౌరవం.

    వారి బ్యానరులో 'చక్రవాకం', 'ప్రేమ్‌నగర్‌' సినిమాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసే అవకాశం లభించింది. అప్పుడు రామానాయుడి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. వారి అబ్బాయితో 'శ్రీనివాస కల్యాణం' తెరకెక్కించేంత చనువు కలిగింది రామానాయుడు వల్లే. అలాంటి మహా నిర్మాత లేరన్న మాట జీర్ణించుకోలేకపోతున్నా అన్నారు.

    ఆదిశేషయ్య, ఆస్కా అధ్యక్షులు మాట్లాడుతూ... ఆస్కా అధ్యక్షుడిగా రామానాయుడు 1979లో ఎన్నికై 1995 వరకు ఆ పదవిలో కొనసాగారు. 1982వ సంవత్సరం నుంచి ఆయనతో నాకు అనుబంధం ఉంది. ఆస్కాలో జరిగే ప్రతి ముఖ్య కార్యక్రమానికి హాజరయ్యేవారు. ఆడిటోరియం నిర్మాణానికి రూ.పది లక్షల విరాళం కూడా అందించారు. ఆయన ప్రోత్సాహంతోనే ప్రస్తుతం ఉన్న రూఫ్‌ గార్డెన్‌ రూపుదిద్దుకుంది. ఎప్పుడు నన్ను కలిసినా మీ ఆరోగ్యం ఎలా ఉంది, ఆస్కా ఎలా ఉంది అంటూ ప్రశ్నిస్తారు. నగరానికి ఆయన ఎప్పుడొచ్చినా ఆస్కాకు రాకుండా మానుకోరు. అది ఆయనకు కన్నబిడ్డ వంటిది అన్నారు.

    English summary
    Senior producers has expressed their deep condolences for the death of Veteran producer Dr D Ramanaidu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X