ఆర్థిక సహాయం చేస్తేనే బ్రతుకుతా.. విషమంగా మారిన సీనియర్ విలన్ ఆరోగ్యం
ఒకప్పుడు విలన్ గా సౌత్ ఇండస్ట్రీలో చాలా బిజీగా కనిపించిన సీనియర్ నటుడు ఇప్పుడు సహాయం కోసం ఎదురుచూస్తున్నాడు. అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆ సీనియర్ నటుడు మరెవరో కాదు. తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న పొన్నాంబళం. ప్రస్తుతం ఈ నటుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. అందుకే ఇటీవల ఆర్థిక సహాయాన్ని కోరుతూ ఒక వీడియో రిలీజ్ చేశాడు.
బెడ్ మీద హాట్ ఫోజుతో బబ్లీ తెలుగు హీరోయిన్ (ఫోటోలు)

స్టార్ హీరోలందరితో
తమిళ్ లో దాదాపు స్టార్ హీరోలందరితో యాక్ట్ చేసిన పొన్నాంబళం రజనీకాంత్, కమల్ హాసన్ వంటి వారితో మంచి సాన్నిహిత్యం ఉంది. 57ఏళ్ల ఈ నటుడు పాతికేళ్ల వయసు నుంచే సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. 1987లో తమిళ్ లో కలియుగం అనే సినిమా ద్వారా వెండితెరకు ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత విలన్ గా బిజీ అయ్యారు.

తెలుగులో కూడా
రజనీకాంత్, కమల్ హాసన్ వంటి స్టార్స్ తో ఎన్నో సినిమాల్లో నటించాడు. కేవలం తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేశాడు. కేవలం నటుడిగానే కాకుండా స్టంట్ మ్యాన్ గా కూడా పలు సినిమాలకు వర్క్ చేశాడు. తెలుగులో ఘరానా మొగుడు, అల్లరి ప్రియుడు, మొగ్గురు మోసగాళ్ళు వంటి సినిమాల్లో నటించారు. చివరగా తెలుగులో బుజ్జిగాడు సినిమాలో నటించాడు.

ఆర్థిక ఇబ్బందుల్లో
తన నటనతో విలన్ గా ఒకప్పుడు ఆడియెన్స్ ను బయపెట్టిన పొన్నాంబళం ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు. అంతే కాకుండా గత కొంతకాలంగా కిడ్నీ సంబందిత వ్యాధితో బాధపడుతున్నాడు. హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న ఈ నటుడికి వీలైనంత త్వరగా ఆపరేషన్ చేస్తేనే బ్రతుకుతాడట. కిడ్నీ మార్పిడి చికిత్స కోసం భారీగా ఖర్చవుతుందని ఆర్థికంగా సహాయం చేస్తే బ్రతుకుతానని పొన్నాంబళం మీడియాకు తెలియజేశాడు.

దయతో సహాయం చేస్తే
తన సోదరి కొడుకు కిడ్నీ దానం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెబుతూ ఇప్పటికే అగ్ర హీరోలు నటులు సహాయం చేసినట్లు చెప్పారు. కమల్ హాసన్, రజనీకాంత్, రాధిక శరత్ కుమార్ సహాయం చేశారని చెబుతూ.. మరికొంత మంది దయతో సహాయం చేస్తే ప్రాణాలతో బయటపడతానని అలాగే తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ కు కూడా పొన్నాంబళం విజ్ఞప్తి చేశారు.


Click it and Unblock the Notifications











