»   » ప్రియుడి సూసైడ్ కేసులో కొత్తకోణం.. ఫేస్‌బుక్‌లో అసభ్యంగా ఫొటోలు.. తమిళ నటి కంటతడి

ప్రియుడి సూసైడ్ కేసులో కొత్తకోణం.. ఫేస్‌బుక్‌లో అసభ్యంగా ఫొటోలు.. తమిళ నటి కంటతడి

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  తమిళ బుల్లితెర నటి నీలాణి ప్రియుడు ఆత్మాహత్యాయత్నం కేసులో పోలీసుల దర్యాప్తు వేగంగా కొనసాగుతున్నది. నీలాణి ప్రియుడి సూసైడ్‌కు ప్రయత్నించిన కారణాలపై అన్వేషిస్తున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా ఇటీవల నటి నీలాణిని పోలీసులు ప్రశ్నించినట్టు సమాచారం. కొద్ది రోజుల క్రితం తనను పెళ్లి చేసుకోమని వేధిస్తున్నాడనే ఆరోపణలపై ప్రియుడు గాంధీ లలిత్ కుమార్‌పై నీలాణి కేసు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కేసు నమోదుతో మనస్తాపం చెందిన లలిత్ కుమార్ ఆత్మహత్యాయత్నానికి చేసుకోవడం వివాదంగా మారింది.

  ప్రియుడిపై నటి వేధింపుల కేసు.. నిప్పంటించుకొని సూసైడ్‌.. సంచలనం రేపిన ఘటన

   భర్త, పిల్లలకు దూరంగా

  భర్త, పిల్లలకు దూరంగా

  నీలాణి, లలిత్ కుమార్ కేసు దర్యాప్తులో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్త, పిల్లలను వదిలేసి అసిస్టెంట్ డైరెక్టర్ లలిత్ కుమార్‌తో నీలాణి సహజీవనం చేస్తున్నారనే విషయం బయటకు వచ్చింది. నటిగా స్థిరపడేందుకు లలిత్‌కుమార్ పరిచయాన్ని ఉపయోగించుకొన్నారని సన్నిహితులు పేర్కొంటున్నారు.

  నీలాణితో ప్రేమ పరిచయం

  నీలాణితో ప్రేమ పరిచయం

  ఇక గాంధీ లలిత్ కుమార్‌‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. తల్లిదండ్రులు లేకపోవడంతో అన్నయ్య సంరక్షణలోనే లలిత్ కుమార్ పెరిగారు. సినీ పరిశ్రమలో రాణించాలనే ఉద్దేశంతో ఉదయనిధి స్టాలిన్ సంస్థలో సినిమాలకు సహాయదర్శకుడిగా మారారు. అప్పుడే నీలాణితో పరిచయం ప్రేమగా మారింది.

  లలిత్‌ కుమార్‌ను దూరంగా

  లలిత్‌ కుమార్‌ను దూరంగా

  అయితే కెరీర్‌పై దృష్టిపెట్టిన నీలాణి.. లలిత్ కుమార్ ప్రేమను దూరంగా పెట్టింది. దాంతో వారి మధ్య విభేదాలు నెలకొన్నాయి. అయితే తనను నీలాణి దూరంగా పెట్టడాన్ని జీర్ణించుకోలేకపోయిన లలిత్ కుమార్ షూటింగ్‌కు వచ్చి నిలదీశాడు అని సన్నిహితులు వెల్లడించారు. దాంతో ఆమె మైలాపూర్ పోలీస్ స్టేషన్‌ ఫిర్యాదు చేయడంతో లలిత్ కుమార్ ఆత్మహత్యాయత్నం చేశారు.

  సూసైడ్ అటెంప్ట్‌తో సంబంధం లేదు

  సూసైడ్ అటెంప్ట్‌తో సంబంధం లేదు

  లలిత్ కుమార్ సూసైడ్ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న నీలాణిని ప్రశ్నించినపుడు తనకు ఎలాంటి సంబంధం లేదు అని పేర్కొన్నట్టు పోలీసులు వెల్లడించారు. పోలీసుల విచారణ అనంతరం మీడియాతో నీలాణి మాట్లాడుతూ.. లలిత్‌కుమార్‌తో తనకు సంబంధం ఉన్న మాట నిజమే. ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం. , అయితే ఇప్పుడే పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదు అని చెప్పాను అని తెలిపింది.

   నా పరువు దిగజార్చేలా

  నా పరువు దిగజార్చేలా

  తన గురించి లలిత్‌కుమార్‌ అసభ్యకరమైన దృశ్యాలను ఫేస్‌బుక్‌లో పెట్టారు. ఆ వ్యవహారం నా పరువును దిగజార్చేలా అనిపించింది. అలాగే పెళ్లి చేసుకోమని వేధించడం, ఇతర పనుల కారణంగా నే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. తన వద్ద సొమ్ము తీసుకుని మోసం చేశాడు అని లలిత్‌ కుమార్‌పై ఆరోపించింది. తనకు జరిగిన మోసాన్ని వివరించి కంటతడి పెట్టింది.

  English summary
  Actress Nilani's frustrated ex-lover has tried to commit suicide as she is unwilling to marry him. This comes a day after she filed a complaint against her ex-boyfriend before the Mylapore police station. The actress later withdrew the complaint. Thiruvannamalai-based Gandhi Lalith Kumar, on Sunday, tried to set himself ablaze by pouring petrol. The onlookers called 108 and the ambulance rushed to the spot before rushing him to the Kilpauk Hospital.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more