'గాడ్స్ మస్ట్ బీ క్రేజీ' తెలుగులో?

By Staff

Senthil
'గాడ్స్ మస్ట్ బీ క్రేజీ' అనే ఆఫ్రికన్ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. అదొక వెరైటీ కామెడీ. దాన్నిప్పుడు తమిళంలో కమిడియన్ సింధిల్ చేయబోతున్నాడు. మన బాబు మోహన్ కి దగ్గర పోలికలుండే ఈ నటుడు మనకూ తమిళ డబ్బింగ్ సినిమాల ద్వారా పరిచయమే. ఈ మధ్య వడివేలు హవా పెరగటంతో అతనికి,అతని మోటు హాస్యానికి చోటు లేకుండా పోయింది. దాంతో వడివేలులాగానే తానూ కామిడీ హీరోగా ట్రై చేయాలని డిసైడ్ అయ్యాడు. దాని ఫలితమే ఈ క్రేజీ కామిడీ Adhivasiyum Adhisayapesiyum. ఇక ఆ కామిడీ సినిమాని తెలుగులోకీ డబ్బింగ్ చేసి వదలాలని నిర్మాతలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

ఇక 'గాడ్స్ మస్ట్ బీ క్రేజీ' కథలో ఓ మారుమూల ప్రాంతలో ఉండి ట్రైబల్ తెగకు చెందిన వాడు హీరో. అతనికి ఆధునిక ప్రపంచ పోకడలు తెలియవు. అతనికి అనుకోకుండా ఓ కోకో కోలా బాటిల్ దొరుకుతుంది. అది పైనుంచి వెళ్తున్న ఓ ప్లైట్ లోంచి తాగి పడేసిన బాటిల్. కానీ అక్కడున్న ఆ తెగ వారికి అదేమిటో అర్ధంకాదు. దాన్ని వారు మొదట దేవుడు పైనుంచి ఇచ్చాడని భావిస్తారు. దాన్ని రకరకాలగా అందరూ ఉపయోగించుకుంటారు. కానీ కొంత కాలానికి అందరికీ అదే అవసరమవటంతో కొట్టుకుంటారు. దాంతో తమ మధ్య గొడవలు పెట్టిన ఈ బాటిల్ సైతాను కుట్ర అని పైకి విసిరేస్తారు.

కాని అది మళ్ళీ క్రిందకి వచ్చి వాళ్ళ నెత్తిపై పడుతుంది. దాంతో టెన్షన్ తట్టుకోలేని వాళ్ళు తమ ప్రాంతానికి దూరంగా విసిరేయాలని నిర్ణయించుకుంటారు. అప్పుడు హీరో దాన్ని పట్టుకుని నాగరిక ప్రపంచంలో కి బయిలు దేరతాడు. అలా కామిడీగా జరుగుతూంటుంది. దాన్నే మార్చి బాటిల్ ప్లేసులో సెల్ ఫోన్ పెడుతూ సినిమా చేస్తున్నారుట. అలాగే ఈ సినిమాలో ఒకప్పటి హీరోయిన్లు మాళవిక,మీనా తమ నిజ జీవిత పాత్రలను పోషిస్తారుట. ఇంకా ఈ సినిమాలో మలై స్వామి,వాయు పురి, రమేష్ అరవింద్ తదితరులు చేస్తున్నారుట. అంటే త్వరలో మనం నవ్వుకోవటానికి మంచి సినిమా రెడీ అవుతోందన్నమాట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X