'ఆటోగ్రాఫ్' కి సీక్వెల్....

By Staff

Cheran
మెల్లిమెల్లిగా ...సీక్వెల్ సంస్కృతి తమిళంలో బాగా పుంజుకుంటోంది.పెద్ద పెద్ద సంస్ధలు తమ హిట్స్ కి సీక్వెల్ చేసే ప్రయత్నాలలో ఉన్నారు. తాజాగా చేరన్ ఆ ప్రయత్నాలలో ఉన్నారని తెలుస్తోంది. ఆయన దర్శకత్వంలో వచ్చిన 'ఆటోగ్రాఫ్' సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. అలాగే ఈ సినిమా అనేక అవార్డులను సైతం సొంతం చేసుకుంది. ఇక ఈ చిత్రం తెలుగులోకి రవితేజ హీరోగా 'ఆటోగ్రాఫ్ నా స్వీట్ మెమరీస్' పేరుతో రీమేక్ అయి ఓ మాదిరిగా ఆడింది.

ప్రస్తుతం ఆ విజయాన్ని చేరన్ కంటిన్యూ చెయ్యాలనుకుంటున్నారు. ఆ సినిమా సీక్వెల్ రెడీ చేస్తున్నారు. ప్రస్తుతం Raman Thediya Seethai షూటింగ్ లో బిజీగా ఉన్నాయన ఈ విషయాన్ని మీడియాకు తెలియచేసారు. మొదటి చిత్రంలో గోపిక చేసిన పాత్రను నవ్య నాయర్ చేస్తుందుట. స్నేహ అదే పాత్రలో కంటిన్యూ అవుతుందిట.గోపిక పెళ్ళికి రెడి అవటంతో చేరన్ ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. నవ్యనాయర్ తో ఇంతకు ముందు చేరన్ Mayakannadi సినిమా చేసాడు.

ఇక ఈ సినిమా సెప్టెంబర్ లో ప్రారంభమవుతుందిట. ఈ సీక్వెల్ మంచి విజయాన్ని సాధిస్తుందని దర్శక,నిర్మాతలు ధీమాగా ఉన్నారు. మరి హిట్టవుతే మన వాళ్ళు ఊరుకుంటారా ...ఇక్కడా రీమేక్ చేస్తారు. కాబట్టి వచ్చే సంవత్సరం ఈ సీక్వెల్ ని మన తెరపై చూడొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X