తమిళ నిర్మాతతో సీరియల్​ నటి రెండో పెళ్లి.. ఫొటోలు వైరల్​

ప్రేమాయణాలు, బ్రేకప్​లు, పెళ్లుల్లు, విడాకులు సినీరంగంలో సాధారాణమే. కానీ ఈ విషయాలు సోషల్​ మీడియాలో మాత్రం జోరుగా వైరల్​ అవుతుంటాయి. సెలబ్రిటీల పెళ్లిల్లకు సంబంధించిన విషయాలు తెలుసుకునేందుకు ఎంతో ఆసక్తితో ఉంటారు. ఇక ఇద్దరు సెలబ్రిటీలే అయితే ఆ టాపిక్​ మరింత హాట్​గా ఉంటుంది. ఈ పెళ్లి తంతుకు సంబంధించిన విషయాలు సూపర్ ట్రెండ్​ అవుతాయి. తాజాగా ఓ తమిళ జంట పెళ్లి ముచ్చట ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఆ విశేషాలేంటో తెలుసుకుందామా!

హాట్​ టాపిక్​గా సెలబ్రిటీల పెళ్లిళ్లు..

హాట్​ టాపిక్​గా సెలబ్రిటీల పెళ్లిళ్లు..

సినీ, బుల్లితెర నటీనటుల లవ్ మ్యాటర్స్​ ఎప్పుడు ఇంట్రెస్టింగ్​గానే ఉంటాయి. వారికి సంబంధించిన విషయాలు ఎప్పుడు సోషల్ మీడియాలో బజ్​ పెంచుతూ ఉంటాయి. ఇప్పటివరకు బాలీవుడ్​లో కత్రీనా కైఫ్​-విక్కీ కౌశల్​, రణ్​బీర్ కపూర్-అలియా భట్, రాజ్​కుమార్​ రావు-పత్రలేఖ, విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ వంటి తదితర తారల పెళ్లిల్ల విషయాలు హాట్​ టాపిక్​గా మారిన విషయం తెలిసిందే.

 రెండో పెళ్లి..

రెండో పెళ్లి..

తాజగా ఓ నిర్మాత, ఓ సీరియల్​ నటిని పెళ్లాడాడు. ఇది వినడానికి సాధారణంగానే ఉన్నా.. ఇందులో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. అయితే ఇది వీరిద్దరికి రెండో పెళ్లి. ఇదివరకే వీళ్లిద్దరికి పెళ్లిళ్లు జరిగి, కొన్ని వ్యక్తిగత కారణాలతో ఎవరి భాగస్వామితో వారు విడిపోయి.. సింగిల్​ లైఫ్​ను లీడ్ చేశారు. ఇంతకాలం సింగిల్​గా జీవించిన వీరిద్దరు తాజాగా మళ్లీ వివాహం అనే బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించారు.

తమిళ ప్రొడ్యూసర్​

తమిళ ప్రొడ్యూసర్​

సీరియల్ నటి, వీజే మహాలక్ష్మీ, తమిళ ప్రొడ్యూసర్​ అయిన రవిందర్​ చంద్రశేఖరన్​ను వివాహం చేసుకుంది. వీరి పెళ్లి వేడుకకు తిరుపతి వేదికగా మారింది. గురువారం అంటే సెప్టెంబర్​ 1న తిరుపతిలో బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్నాయి. ఈ పిక్స్​ చూసిన నెటిజన్లు విశెస్​ తెలియజేస్తున్నారు.

వీజేగా కెరీర్​ ప్రారంభం..

వీజేగా కెరీర్​ ప్రారంభం..

ఇక వారి సినీ కెరీర్ విషయాలకొస్తే.. రవిందర్​ చంద్రశేఖరన్​​ నిర్మిస్తున్న రెండు సినిమాల్లో మహాలక్ష్మీ నటిస్తోందట. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం మొలకెత్తి.. పెళ్లి దాకా తీసుకొచ్చిందని టాక్. వీజేగా కెరీర్​ ప్రారంభించిన మహాలక్ష్మీ అనంతరం సీరియల్స్​లోకి అడుగుపెట్టింది. బుల్లితెరపై సీరియల్స్​లో తనదైన నటనతో ప్రేక్షకుల మెప్పు పొందింది మహాలక్ష్మీ.

లిబ్రా ప్రొడక్షన్స్​లో..

లిబ్రా ప్రొడక్షన్స్​లో..

వాణి రాణి సీరియల్​లో పోషించిన పాత్రకు మహాలక్ష్మీకి మంచి గుర్తింపు లభించింది. ఇదే కాకుండా తదితర సీరియల్స్​లో నటించి ఆకట్టుకుంది మహాలక్ష్మీ. ఇక నిర్మాత రవిందర్​ చంద్రశేఖరన్​​ లిబ్రా ప్రొడక్షన్స్​ బ్యానర్​పై తమిళంలో పలు సినిమాలకు ప్రొడ్యూసర్​గా వ్యవహరించాడు. ప్రస్తుతం వీరిద్దరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్​ కావడం విశేషంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X