twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వివాదాల్లో 'సెవెంత్ సెన్స్' చిత్రం

    By Srikanya
    |

    మురగదాస్, సూర్య కాంబినేషన్ లో వచ్చిన సెవెంత్ సెన్స్ చిత్రం హిట్టు మాటలా ఉన్నా రోజుకో వివాదంలో కూరుకుపోతోంది. ఈ చిత్రం తమిళ చరిత్రను బేస్ చేసుకుని తయారు చేసానని, తమిళలు అంతా గర్వపడతారని రిలీజుకు ముందు మురగదాస్ చెప్పటం జరిగింది. గర్వపడటం ఎలా ఉన్నా ఇప్పుడు అస్సలు సినిమాలో చూపిన భోదిదమ్మ అనే వ్యక్తి తమిళనాడు నుంచి వెళ్లలేదని, చరిత్రను సరిగ్గా తెలుసుకోకుండా ఇష్టమొచ్చినట్లు తీసారంటూ భోధిదమ్మకు ట్రస్టుకు చెందిన కొందరు ప్రముఖలు వ్యాఖ్యలు చేసారు. అది ప్రక్కన పెడితే ఇక్కడ తమిళనాడులో పల్లవ రాజే భోధిదమ్మగా మారాడంటూ చూపారు. కానీ సినిమాలో చూపినట్లు అస్సలు పల్లవరాజు డ్రస్ లు, కట్టు బొట్టు తమిళ సంప్రదాయం కాదని అని లోకల్ గా ఉండే చరిత్రకారులు మండిపడుతున్నారు. అంతేకాక బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా చరిత్రపై సినిమాలు తీస్తున్నాయని అక్కడి భాస్కరన్ అనే చరిత్రకారుడు అన్నారు.

    దాంతో తమిళ చరిత్రను ఓ ఊహాత్మక కథగా, కల్పిత గాధగా మార్చేసారని అన్నారు. మరికొందరు సైంటిఫిక్ గా ప్రపచం డవలప్ అవుతున్న దశలో ఆవు పేడ గొప్పతనం చెప్పాలని మురగదాస్ ప్రయత్నించాడని వ్యాఖ్యానించారు. ఇక దీపావళి కానుకగా తెలుగునాట విడుదలైన ఈ చిత్రం ఇక్కడ వర్కవుట్ కాలేదు. తమిళంలో యావరేజ్ ఫిల్మ్ గా టాక్ తెచ్చుకుంది. చరిత్రను సినిమాలో హైలెట్ చేసే ప్రయత్నం చేసినా అందుకోసం సినిమాలో మిగతా పాత్రలతో కలిపిన అవాస్తవిక అంశాలు సినిమాను దిగజారేలా చేసాయని అక్కడ మీడియా దుమ్మత్తిపోసింది.

    English summary
    “The film-makers of Seventh Sense completely neglect the aspects of dress, jewels and weapons that are depicted in our sculptures. They do not even do basic research.”
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X