సెక్స్ బాంబ్ షకీలా వెడ్డింగ్ డేట్ ఫిక్సెడ్
షకీలా చెన్నైకి చెందిన వ్యాపారవేత్త పి.జి.సురేష్ తో మరి కొద్దిరోజుల్లో పెళ్లి పీటలు ఎక్కనున్న సంగతి తెలిసిందే. అయితే పెళ్ళి రోజు మాత్రం ఇన్నాళ్ళూ తెలియచేయలేదు. తాజాగా ఆమె తమిళ మీడియాతో మాట్లాడుతూ ఫిబ్రవరి 4న వివాహ ముహూర్తంగా ఇరుకుటుంబాల పెద్దలు నిశ్చయించినట్టు తెలిపింది. చెన్నైలో ఓ కళ్యాణ మండపంలో ఈ వివాహ వేడుక జరుగుతుంది. ఇక ఆమెను చేసుకోబోయే పి.జి.సతీష్ కి విజయ్ కాంత్ స్ధాపించిన డిఎండికె పార్టీతో ఆయనకు సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. అలాగే ఆయన ఫిల్మ్ ఫైనాన్సియర్ గా, రియాల్టర్ గా కూడా పేరు పొందిన వ్యక్తి.
ఈ విషయాలను షకీలా దృవీకరిస్తూ..తమ మధ్య చాలాకాలంగా పరిచయం ఉందనీ, ఒకరినొకరు అర్ధం చేసుకున్న తర్వాతనే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుని ఆగామనీ షకీలా తెలిపింది. అలాగే వీరి వివాహానికి ఇరుకుటుంబాల పెద్దలు అంగీకరించడంతో గత డిసెంబర్ లో నిశ్చితార్థం జరిగింది. కొద్దికాలంగా మలయాళంలో సెక్స్ సినిమాలు చేయటం మానిన షకీలా ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో మాత్రనే నటిస్తోంది. తమిళంలో 'మాంజ వేలు', 'తొట్టు పార్', 'పయనగల్ తోడరుం' చిత్రాల్లో షకీలా నటిస్తోంది. అలాగే తానకి పెళ్లయినంత మాత్రాన సినిమాల్లో నటించకూడదనే రూలు లేదనీ, అయితే సతీష్ తో సమ్మతంతోనే తుది నిర్ణయం తీసుకుంటామనీ షకీలా చెబుతోంది. బెస్టాఫ్ లక్ షకీలా.


Click it and Unblock the Notifications











