ఎక్స్ ఫోజింగ్ చేస్తూనే కామెడి పండిస్తానంటోంది...!?
సెక్సీభామ సంగీత ఇకపై కామెడీ చెస్తానంటోంది. కమల్ తో కలిసి 'మన్మథన్ అంబు" అనే సినిమాలో సంగీత నటిస్తోంది. ఈ సినిమా లో మెయిన్ హీరోయిన్ త్రిష అయినా, తన పాత్ర కూడా తక్కువ నిడివిదేమీ కాదని అంటోంది సంగీత. కామెడీ సినమాల్లో నటించాలనేది తన డ్రీమ్అనీ, అడపా దడపా కొన్నిసినిమాల్లో కామెడీని పండించినా, పూర్తిస్థాయి కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న సినిమా ఇదేనని సంగీత చెప్పుకొచ్చింది. కమల్ తో నటించే ఛాన్స్ రావడం తన అదృష్టమనీ, ఇకపై ఎక్కువగా కామెడీ సినిమాలపై దృష్టిపెడ్తానని చెబుతోంది సంగీత.
సినిమాల్లో ఛాన్సులు తగ్గాయని పెళ్ళి చేసుకుంటే, పెళ్ళి చేసుకున్నాక అవకాశాలు ఎక్కువగా వస్తుండడంతో సంగీత తెగ సంబరపడిపోతోంది. అన్నట్టు, పెళ్ళయిపోయినాసరే, గ్లామరస్ గా కన్సించడానికి తనకెలాంటి అభ్యంతరం లేదనీ, నటన అన్నాక అన్నీ చేయాలని సంగీత గ్లామరస్ పాత్రలకు 'సై" అనేస్తోంది. సంగీత 'సై" అనడం సంగతెలా ఉన్నా ఆంటీతో ఎక్స్ పోజింగ్ చేయించేంత సరదా దర్శక నిర్మాతలకు వుండొద్దూ...


Click it and Unblock the Notifications











