Jawan Audio Event విజయ్ నాపై ప్రతీకారం తీర్చుకో.. కానీ అమ్మాయిలను దూరం చేయలేవు.. షారుక్ స్పీచ్ వైరల్
ఇండియన్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ హీరోగా నయనతార హీరోయిన్‌గా, దీపిక పదుకోన్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం జవాన్. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఈ సినిమాను రెడ్ చిల్లీస్ బ్యానర్‌పై గౌరీ ఖాన్, గౌరవ్ వర్మ నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 7వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో జవాన్ ఆడియో ఫంక్షన్‌ను చెన్నైలో భారీగా నిర్వహించారు. ఈ సందర్భంగా షారుక్ ఖాన్ మాట్లాడుతూ..
చెన్నైలో జరిగే ఫంక్షన్ ఎప్పటికీ గుర్తుండిపోయేలా నిర్వహించాలని అట్లీ చెప్పాడు. అయితే నా జీవితంలో ఇంత పెద్ద ఫంక్షన్‌లో ఎప్పడూ పాల్గొనలేదు. చెన్నైలో ఈవెంట్‌ను నేను ఎప్పుడూ మరిచిపోలేను. ఈవెంట్‌కు తరలివచ్చిన స్టూడెంట్స్, అభిమానులు, చెన్నై వాసులకు ధన్యవాదాలు. తమిళ సినిమా పరిశ్రమ నన్ను సాదరంగా ఆహ్వానించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. తమిళ సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు జవాన్ ఫంక్షన్‌కు రావడం చాలా ఆనందంగా ఉంది అని షారుక్ ఖాన్ ఎమోషనల్‌గా మాట్లాడారు.

తమిళ సినిమా పరిశ్రమలో అనుబంధం ఎలా ఏర్పడిందంటే.. తమిళ సినిమా పరిశ్రమలో నాకు ఇద్దరే ఇద్దరు స్నేహితులు. ఒకరు మణిరత్నం. మరొకరు సంతోష్ శివన్. మణిరత్నంతో దిల్ సే సినిమాకు పనిచేశాను. అది నా తొలి తమిళ చిత్రం. ఆ సమయంలో ఆ చిత్రంలో ఛయ్యా ఛయ్యా పాటకు డ్యాన్స్ చేశాను అంటూ షారుక్ స్టెప్పులేశాడు. ఆ తర్వాత కమల్ హాసన్‌తో హే రామ్ సినిమాలో పనిచేశాను. ఆ సినిమాలో నేను తమిళంలో మాట్లాడాను. నేను తమిళంలో మాట్లాడటం అదే తొలిసారి అని షారుక్ ఖాన్ అన్నారు.

ఇక నాకు తమిళ సినిమాలో నాకు మరో స్నేహితుడు ఏర్పడ్డాడు. నేను నటించిన రా వన్ సినిమాలో ఒకే ఒక సన్నివేశంలో నటించడానికి అంగీకరించిన రజనీకాంత్ నాకు మరో స్నేహితుడు. తమిళ సినిమాలో నాలుగైదుగురు స్నేహితులు ఏర్పడ్డారు. అప్పటి నుంచి నాకు తమిళ పరిశ్రమతో అనుబంధం బలంగా ఏర్పడింది అని షారుక్ ఖాన్ ఎమోషనల్ అయ్యారు.

ఇక విజయ్ సేతుపతి నా గురించి ప్రార్థిస్తూ.. అమ్మాయిల గురించి మాట్లాడాడు. విజయ్ సేతుపతి సార్ నాపై ప్రతీకారం తీర్చుకోవచ్చునేమో గానీ.. అమ్మాయిలను నా నుంచి విజయ్ సేతుపతి వేరు చేయలేడు. ఎందుకంటే నేను నా సిగ్నేచర్ స్టెప్పుకు ఎవరైనా పడిపోవాల్సిందే అని షారుక్ ఖాన్ అన్నాడు.
ఇక అట్లీ నాతో సినిమా చేసే సమయంలో యంగ్ అండ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్‌కు తమిళంలో కొన్ని పాటలు చేసే అవకాశం ఇద్దాం అంటే.. లేదు.. అన్ని పాటలు అనిరుధ్‌కే ఇద్దామని అన్నాను. జవాన్ సినిమాకు అదిరిపోయే పాటలు ఇచ్చాడు. అనిరుధ్ నాకు కొడుకు లాంటి వాడు. అతడిని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. కొలవెరి కొలవెరి పాట నాకు చాలా నచ్చిన పాట అని షారుక్ ఖాన్ అన్నాడు.


Click it and Unblock the Notifications











