తమిళ చిత్రంలో షారుక్ ఖాన్.. స్టార్ హీరో మూవీలో అతిథి పాత్ర!
బిగిల్, మాస్టర్ చిత్రాల విజయం తర్వాత తమిళ సూపర్‌స్టార్ విజయ్ నటిస్తున్న బీస్ట్. ఈచిత్రానికి సంబంధించిన వివరాలు మరింత ఆసక్తిని రేపుతున్నాయి పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫిని అందిస్తున్నారు. 2021 చివర్లో రిలీజ్ చేసేందుకు యూనిట్ ప్లాన్ చేస్తున్నది.
అయితే విజయ్ 47వ పుట్టిన రోజు సందర్భంగా బీస్ట్ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్‌ను రిలీజ్ చేశారు. ఆ ఫస్ట్ లుక్‌కు విశేషమైన స్పందన వ్యక్తమైంది. బాలీవుడ్ ప్రముఖులు సైతం విజయ్ లుక్‌పై రియాక్ట్ అవ్వడమే కాకుండా ప్రశంసలు గుప్పించారు.

అయితే ఇటీవల ఇన్స్‌టాగ్రామ్ లైవ్‌లో విజయ్ గురించి షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ.. బీస్ట్ లుక్‌ను ప్రశంసించారు. ఒక్క మాటలో విజయ్ గురించి చెప్పమంటే.. వెరీ కూల్ అంటూ కామెంట్ చేశాడు.
అయితే తమిళ మీడియా కథనాల ప్రకారం.. బీస్ట్ చిత్రంలో షారుక్ ఖాన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. ఈ వార్తను యూనిట్ వర్గాలు కూడా కొట్టి పడేయకపోవడంతో ఈ వార్తలో వాస్తవం ఉందనే ప్రచారం జరుగుతున్నది. త్వరలోనే షారుక్ రోల్ గురించి అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. గతంలో చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్రంలో తమిళ నేపథ్యం ఉన్న కథలో హీరోగా నటించిన విషయం తెలిసిందే.
బిగిల్ చిత్రానికి దర్శకత్వం వహించిన అట్లీ కుమార్ డైరెక్షన్‌లో షారుఖ్ ఖాన్ ఓ చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. కోవిడ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.


Click it and Unblock the Notifications











