Don't Miss!
- Finance Google Layoffs: ఉద్యోగులను మళ్లీ తగ్గించిన గూగుల్.. భారతీయ టెక్కీలపై భారీ ప్రభావం..
- Sports లేడీ ఫ్యాన్ అందాన్ని చూసి కంట్రోల్ తప్పిన గిల్ Video
- Technology షియోమీ ప్రత్యేక ఈవెంట్.. బడ్స్ 5A, ప్యాడ్ SE సహా కీలక ఉత్పత్తుల విడుదల.. పూర్తి వివరాలు..!
- News మళ్లీ బయటపడ్డ ఈవీఎం మోసం ! ఏ బటన్ నొక్కినా బీజేపీకే ఓటు...?
- Automobiles రూ. 150 కే విమాన టికెట్.. ట్రైన్ జర్నీ కంటే చాలా చీప్.. ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా.??
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
విలన్‌గా షారుక్ ఖాన్... విజయ్ కోసం మెట్టు దిగిన బాద్షా
బాలీవుడ్లో వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న బాద్షా షారుక్ ఖాన్ మరోసారి విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. అట్లీ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న తన 63వ సినిమాలో షారుక్ ఖాన్ ప్రతి నాయకుడి పాత్రలో కనిపించబోతున్నట్టు తమిళ మీడియా కోడై కూస్తున్నది. ఇటీవల చెన్నైలో అట్లీ, షారుక్ ఖాన్ కలువడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. ఇదే ఒకవేళ నిజమైతే మరో బాలీవుడ్ హీరో తమిళ ఇండస్ట్రీకి విలన్‌గా పరిచయం కాబోతున్నారనే విషయం గమనార్హం.
భోజనం, టాయిలెట్లు కావాలని అడిగితే.. బూతులు తిట్టిన క్రేజీ డైరెక్టర్.. కేసు నమోదు చేసిన నటి!
విజయ్ 63వ సినిమాను ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్నది. ఈ సినిమా కోసం భారీగా ఓ సెట్‌ను చెన్నైలో ప్రత్యేకంగా నిర్మించారు. ఈ సినిమాలో షారుక్ ఖాన్ పాత్ర చాలా పవర్ ఫుల్‌గా ఉంటుంది అని సినీ వర్గాలు వెల్లడించాయి. విజయ్‌తో తలపడే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయని పేర్కొంటున్నారు.
షారుక్, అట్లీ భేటీ సందర్భంగా మెర్సల్ రీమేక్ గురించి ప్రస్తావన వచ్చినట్టు సమాచారం. అయితే ఈ వార్తపై క్లారిటీ లేకపోవడంతో అసలు బాలీవుడ్లో రీమేక్ ఉంటుందా? లేదా అనే సందేహంగానే మారింది.
గతంలో షారుక్ ఖాన్ కొన్ని చిత్రాల్లో విలన్‌గా నటించి మెప్పించారు. బాజీఘర్, డర్ చిత్రాల్లో నటన సినీ అభిమానులను, విమర్శకులను ఆకట్టుకొన్నది. మరోసారి విలన్‌గా మెప్పిస్తాడా లేదా అనే వేచి చూడాల్సిందే.