నయనతారకు ముద్దు పెట్టిన షారుక్ ఖాన్.. ఇంటి సభ్యుల ముందే షాకింగ్ గా.. వీడియో వైరల్!
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ తనదైన శైలీలో సినిమాలు చేస్తూ హిందీ చిత్రసీమకు బాద్ షాగా మారాడు. సుధీర్ఘకాలంగా సినిమాలు చేస్తూ ప్రత్యేకమైన స్టార్ డమ్ సంపాదించుకున్నాడు షారుక్ ఖాన్. హిందీ చిత్రపరిశ్రమలో సుమారు 80కి పైగా సినిమాల్లో హీరోగా నటించిన కింగ్ ఖాన్ 14 ఫిలీం ఫేర్ అవార్డులను కొల్లగొట్టాడు. చాలా కాలం గ్యాప్ తర్వాత తాజాగా పఠాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు షారుక్. ఈ సినిమాకు అభిమానులతో పాటు ఆడియెన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఇక షారుక్ తన తర్వాతి సినిమా జవాన్ కోసం సంసిద్ధం అవుతున్నాడు. ఈ క్రమంలో తాజాగా చెన్నైలోని నయనతార నివాసానికి వెళ్లిన షారుక్ ఆమెను కిస్ చేసి షాక్ ఇచ్చాడు.

పఠాన్ గా అభిమానుల ముందుకు..
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. తనదైన యాక్టింగ్ తో సుధీర్ఘకాలంగా సినిమాలు చేస్తూ ఎంటర్టైన్ చేస్తున్నాడు. 2018లో జీరో సినిమాతో ఫ్లాప్ మూటగట్టున్న షారుక్ ఖాన్ ఇటీవల రాకెట్రీ, బ్రహ్మాస్త్రం వంటి సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేసి ఆకట్టుకున్నాడు. షారుక్ ఖాన్ ఫుల్ లెంగ్త్ సినిమా కోసం అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న క్రమంలోనే తాజాగా పఠాన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు షారుక్ ఖాన్.

ఐదేళ్ల తర్వాత రావడంతో..
కింగ్ ఖాన్ షారుక్ పఠాన్ మూవీలో హాట్ బ్యూటి దీపిక పదుకొణె హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. వీళ్లిద్దరు ఇప్పటికీ ఓం శాంతి ఓం, చెన్నై ఎక్స్ ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్ చిత్రాల్లో జంటగా కలిసి నటించారు. ఇప్పుడు మరోసారి జోడి కట్టిన ఈ పఠాన్ చిత్రానికి యాక్షన్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. చాలా కాలం గ్యాప్ అంటే దాదాపుగా ఐదేళ్ల తర్వాత షారుక్ ఖాన్ నుంచి వచ్చిన సినిమా కావడంతో అభిమానుల అంచనాలకు తగినట్లుగా ఉండి.. భారీ విజయాన్ని దక్కించుకుంది.

జవాన్ కోసం రెడీగా..
ప్రముఖ హిందీ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలీంస్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిన పఠాన్ మూవీ జనవరి 25న విడుదలై ఘన విజయం సాధించింది. ఇందులో షారుక్, దీపికా, జాన్ అబ్రహం నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో ఇండియన్ స్పై నేపథ్యంలో వచ్చిన పఠాన్ సినిమాతో షారుక్ ఖాన్ సాలిడ్ కమ్ బ్యాక్ హిట్టు కొట్టాడని అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఇప్పుడు తన తర్వాతి సినిమా జవాన్ కోసం రెడీ అయ్యాడు షారుక్ ఖాన్.

పనిలో పనిగా నయనతార ఇంటికి..
సౌడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుక్ ఖాన్ హీరోగా నటిస్తున్న చిత్రం జవాన్. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ అన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంతోనే నయన్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ప్రస్తుతం జవాన్ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. అందుకోసం షారుక్ ఖాన్ చెన్నైకి వచ్చాడు. జవాన్ చిత్రీకరణకు వచ్చిన షారుక్ ఖాన్ పనిలోపనిగా నయనతారను, ఆమె ట్విన్ బేబీస్ ని చూసేందుకని ఆమె నివాసానికి వెళ్లాడు.
కారులో కూర్చున్నప్పుడు..
నయనతార ఇంట్లో కొద్ది సమయం గడిపిన షారుక్ ఖాన్ తిరిగి వెళ్తుండగా.. నయన్ తోపాటు ఆమె ఫ్యామిలీ మెంబర్స్ తదితరులు సెండాఫ్ ఇచ్చేందుకు బయటకు వచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే ఈ వీడియోలో కారులో కూర్చున్న షారుక్ ఖాన్ అందులో నుంచి నయనతార బుగ్గపై కిస్ పెట్టి ఆమెకు గుడ్ బై చెప్పాడు. దాన్ని చాలా క్యాజువల్ గా తీసుకున్న నయన్ గుడ్ బై అంటూ చెప్పడం ఆ వీడియోలో చూడొచ్చు.
విలన్ గా విజయ్ సేతుపతి..
సెండాఫ్ ఇచ్చే క్రమంలో నయన్ బుగ్గపై వాళ్ల ఇంటి సభ్యుల ముందే షారుక్ ముద్దు పెట్టడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే జవాన్ చివరి షెడ్యూల్ లో నయనతార జాయిన్ కానుంది. ఇక పాన్ ఇండియాగా వస్తున్న ఈ సినిమా జూన్ 2న హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇందులో విజయ్ సేతుపతి విలన్ గా చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుండగా.. ప్రియమణి, సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్, యోగి బాబు నటిస్తున్నారు.
షారుక్ కు గ్రాండ్ గా స్వాగతం..
ఇక షారుక్ ఖాన్ జవాన్ సినిమాతో పాటు రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో డుంకీ మూవీ కూడా చేస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ లో విడుదల కానుంది. డుంకీ చిత్రంలో బ్యూటిఫుల్ తాప్సీ హీరోయిన్ గా నటిస్తోంది. కాగా చెన్నైకి వచ్చిన షారుక్ ఖాన్ కు గ్రాండ్ గా స్వాగతం పలికారు. ఆయనతో సెల్ఫీలు దిగారు. అలాగే చెన్నైలో తన అభిమానులతో కాసేపు ముచ్చటించి సరదాగా గడిపాడు షారుక్ ఖాన్.


Click it and Unblock the Notifications











