రోజుకు 20 వేలు ఇస్తాం.. వస్తావా అని అడిగారు.. తలకొట్టేసినట్టయింది.. షకీలా

By Rajababu

Recommended Video

Actress Shakeela Talks About Her Incidents In Life

సుమారు రెండు దశాబ్దాలపాటు వెండితెరపై సంచలన రేపిన షకీలా ప్రస్తుతం సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్నారు. తన జీవితంలోని సంఘటన ఆధారంగా చేసుకొని ఓ బయోపిక్‌ను దర్శకుడు ఇంద్రజిత్ లంకేష్ రూపొందించే పనిలో ఉన్నారు. రిచా చద్దా షకీలాగా కనిపించనున్నారు. దాంతో ఆమె ఒక్కసారిగా మీడియాలో ప్రముఖంగా మారారు. ఈ సందర్భంగా ఓ ఆంగ్ల దిన పత్రికలో నటి రిచా చద్దాతో మాట్లాడుతూ వెల్లడించిన విషయాలు ఇవే.

నా లైఫ్ తెరిచిన పుస్తకం

నా లైఫ్ తెరిచిన పుస్తకం

తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్ర పరిశ్రమల్లో రెండు దశాబ్దాలపాటు నేనేంటో రుజువు చేసుకొన్నాను. ఇప్పుడు సినిమా పరిశ్రమకు, మీడియాకు దూరంగా ఉండటంలో నాకు ఎలాంటి బాధలేదు. నా జీవితం తెరిచిన పుస్తకం లాంటింది. నేను ఎక్కడ ఉన్న నాలాగే ఉంటాను.

నా గురించి చెప్పుకోవడం నాన్సెన్స్

నా గురించి చెప్పుకోవడం నాన్సెన్స్

నా గురించి నేను మాట్లాడాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే ప్రచారానికి, సినీ వర్గాలకు దూరంగా ఉన్నాను. నా గురించి నేను ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఏముంది? నేను ఎప్పడు లేచాను? బ్రేక్‌ఫాస్ట్‌లో ఏం తిన్నాను. ఇవన్నీ అవసరమా? ఇలా మాట్లాడుకోవడం నాన్సెన్స్ అని షకీలా అన్నారు.

గేమ్స్ ఆడుకొంటున్నా

గేమ్స్ ఆడుకొంటున్నా

ప్రస్తుతం నా పరిధిలో ఉన్న జీవితాన్ని, సమయాన్ని చక్కగా ఎంజాయ్ చేస్తున్నాను. ఖాళీ సమయాల్లో కంప్యూటర్ గేమ్స్ ఆడుకొంటాను. మొబైల్‌లో గేమ్స్ ఆడుకొంటాను. లేదంటే హాలీవుడ్ సినిమాలు చూస్తాను. ఇప్పుడు నా జీవితాన్ని నేను పరిపూర్ణంగా అనుభవిస్తున్నాను.

హిందీ సినిమాలో ఆఫర్లు

హిందీ సినిమాలో ఆఫర్లు

20 ఏళ్ల కెరీర్‌లో హిందీలో కూడా అవకాశాలు వచ్చాయి. కానీ నేను అంగీకరించలేదు. సినిమా అవకాశాలు తగ్గిన తర్వాత 2013లో చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమాల్లో అవకాశం వచ్చింది. అప్పటికి దర్శకుడు రోహిత్ శెట్టి, షారుక్ ఖాన్ నాకు పరిచయం లేరు. కానీ వాళ్లు నన్ను సంప్రదించిన తీరే నాకు ఇబ్బంది కలిగించింది.

రూ.20 వేలు ఇస్తాం

రూ.20 వేలు ఇస్తాం

చిత్ర యూనిట్ ఏకంగా నా ఇంటికి వచ్చి చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో సత్యరాజ్ పక్కన నటించమని నన్ను అడిగారు. నేను సరే అన్నాను. కానీ రోజుకు రూ.20 వేలు మాత్రమే ఇస్తాం. ఆడిషన్‌కు రావాలని ఏకంగా సత్యరాజ్ ముందే చెప్పడం నాకు తలకొట్టేసినంత పనైంది. ఏమిటి నా విలువ రూ.20 వేల విలువకట్టడం చాలా బాధేసింది. అంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తూ నాకు 20 వేలు ఇస్తానని చెప్పడం నాకు నచ్చలేదు.

కమల్‌ హాసన్‌తో నటించాలని

కమల్‌ హాసన్‌తో నటించాలని

నా జీవితం మొత్తం ఓ సవాల్‌తో కూడుకొన్నది. ఎవ్వరిని కూడా నమ్మవద్దు అని మొత్తం జీవితంలో నేను నేర్చుకొన్న గుణపాఠం. నటిగా కనిపించాలన్నది నా కల. అది పూర్తయింది. ఎప్పుడైనా కమల్ హాసన్‌తో నటించాలన్నదే నా కోరిక. నా అభిమాన నటుడి పక్కన నటించే అవకాశం కోసం ఎదురుచూస్తుంటాను అని షకీలా చెప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X