షకీలా అభిమానులుకు శుభవార్త!!
తన శృంగార విన్యాసాలతో కుర్ర కారును ఒక ఊపు ఊపిన షకీలా ఇప్పుడు ఏం చేస్తోందనేది అందరికి వచ్చే డౌటు. అయితే ఆమె తన అభిమానులుకు ఆనంద పరిచేందుకు మళ్ళీ రెడీ అవుతోంది. వరసగా సినిమాలు ఒప్పుకుంటోంది. ఆమె హాస్య నటింగా చేస్తున్న షణ్ముగపురం చిత్రం ఈ నెలాఖరు నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. ఆ విశేషాలను చెప్తూ..మరో రెండు తమిళ చిత్రాలు చేస్తున్నాను.వాటి పేర్లు అడగకండి. నాకు అంతగా గుర్తు ఉండవు. షూటింగ్ స్పాట్‌లోకి వెళ్లిన తరువాత క్లాప్ బోర్డు చూసిన తరువాత ఓహో నేను నటిస్తున్న చిత్రం పేరు ఇదా? అని అనుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. కాల్‌షీట్స్ మేనేజర్ పలాన షూటింగ్ అని చెప్పడం, నేనా షూటింగ్‌కు వెళ్లడం ఆనవాయితీగా మారింది. ఇకపోతే కన్నడంలో ఐదు చిత్రాలు చేస్తున్నాను. మలయాళంలో మరో రెండు చిత్రాలు చేస్తున్నాను అంది. ఆ మధ్యన పెళ్ళి చేసుకుంటోంది,లైఫ్ లో సెటిల్ అవుతోందని విన్నవన్నీ రూమర్స్ అని కొట్టిపారేసింది.మొత్తానికి అభిమానలకే ఆమె అంకితమన్నమాట. అలాగే ఆమె రీసెంట్ గా గాయని గా కూడా అవతారం ఎత్తింది. షణ్ముగపురం చిత్రంకోసం ఆమె ఓ పాట కూడా పాడింది.


Click it and Unblock the Notifications











