షకీలా వచ్చింది.... షేక్ చేసింది!
షకీలా లాంటి సెక్సీ లేడీని మామూలు పాత్రల్లో చూడటానికి ఎవరూ మాత్రం ఇష్ట పడతారు చెప్పండి. షకీలాపై ప్రేక్షకుల ఆసక్తిని గమనించిన పలువురు దర్శకులు....మరీ బూతు పాత్రలు కాకుండా శృంగారం టచ్ ఉన్న పాత్రలు, డబుల్ మీనింగ్ డైలాగులతో కూడిన సన్నివేశాలు ప్లాన్ చేసేవారు. కొన్ని సినిమాల్లో ఇవి బాగానే వర్కౌట్ అయ్యాయి కూడా.
ఆ విషయాలు పక్కన పెడితే.... షకీలా, మరో శృంగార తార సుజి బాలా బుధవారం తమిళనాడులోని విలుప్పురం జిల్లా, మెల్మలయనూర్ గ్రామంలోని 'అంగాల పరమేశ్వరి' గుడిని సందర్శించారు. ఇద్దరు సెక్సీ లేడీలు ఈ గుడికి వచ్చారని తెలియడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లోని షకీలా అభిమానులు భారీగా తరలి వచ్చారు.
దీంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. షకీలా, సుజి బాలా అక్కడ దాదాపు 3 గంటలు గడిపారు. వాళ్లు వెళ్లేదాకా క్రౌడ్ కంట్రోల్ చేయడానికి ఆపసోపాలు పడ్డారట పోలీసులు. మరి షకీలా లాంటి సెక్సీలేడీ వస్తే....ఏ ప్లేస్ అయినా షేక్ కాకుండా ఉంటుందా!


Click it and Unblock the Notifications












