ఎన్టీఆర్, ఇలియానా లేకుండా 'శక్తి' ఆడియో విడుదల
అదేంటి శక్తి ఆడియో విడుదల అయ్యి చాలా రోజులు అయ్యిందిగా మళ్ళీ ఆడియో రిలీజ్ ఏంటనుకుంటున్నారా. శక్తి తమిళ వెర్షన్ ఆడియోను చెన్నైలో మార్చి అరవై ఒకటి సాయింత్రం విడుదల చేసారు. అయితే ఏ విధమైన హంగామా లేకుండా ఈ ఫంక్షన్ ని లాగించేసారు. ఈ పంక్షన్ కి ఎన్టీఆర్ గానీ, ఇలియానా గానీ రాలేదు. అశ్వనీదత్, మెహర్ రమేష్ హాజరైన ఈ పంక్షన్ లో తమిళ నటుడు ప్రభు, దర్శకుడు పి.వాసు కూడా పాల్గొన్నారు. అక్కడ మీడియా కూడా ఈ ఆడియో ఉత్సవాన్ని అస్సలు కవర్ చేయలేదు. పట్టించుకోలేదు. ఇక అశ్వనీదత్ నిర్మిస్తున్న 52వ చిత్రం 'శక్తి'. ఎన్టీఆర్ హీరోగా గా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ఇలియానా హీరోయిన్ గా చేసింది. ఈ చిత్రం ఈ నెల 30 ప్రేక్షకుల ముందుకొస్తోంది..ఈ చిత్రం కథ శక్తి పీఠాల నేపధ్యంలో సాగుతుంది. అలాగే ఎస్పీ బాలసుబ్రహమణ్యం ఈ చిత్రంలో శక్తి పీఠాల ప్రాశస్త్యం గురించి వివరిస్తారు.


Click it and Unblock the Notifications











