యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘శక్తి’ రిపోర్ట్ ఫ్రం చెన్నయ్..!
అక్కడ బ్యాట్ అండ్ బాల్ ఫైట్ చరమాంకానికి చేరుకుంటే ఇక్కడ మన బాక్సాఫీస్ ఫైట్ ఈ రోజునుంచే ఆరంభం కాబోతోంది. మరీ టాలీవుడ్ పోరులో ఎన్ని సంచలన ఫలితాలు సంభవిస్తాయో చూడాలనీ, ఎలాంటి రికార్డులు నమోదవుతాయో తేలాలనీ అభిమాన ప్రేక్షకులంతా ఆరాటపడుతోన్న నేపథ్యంలో ఈ వేసవి పోటీలో ముందుగా తనే పోటెత్తేందుకూ..తన 'శక్తి"ని చూపించేసి సత్తా చాటేందుకూ నేడు (ఏప్రిల్1)వెండితెర వేదికపైకి లంఘించాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అయితే భారీ బడ్జెట్ తో రూపొంది..భారీ అంచనాలను సృష్టించి..భారీ స్థాయిలో విడుదలవుతోన్న ఈ చిత్రాన్ని వరల్డ్ కప్ ఫైనల్ కి కూడా వెరవకుండా విడుదల చేయడంలో 'శక్తి" టీమ్ తమ తెగువను చూపించింది కానీ తెరపై మాత్రం ఆ సాహసానికి సరిపడేటంతటి సామర్థ్యం చూపలేకపోయిందని టాక్.
ఆ వివరాల్లోకి వెళితే..నిజానికి చాలాచోట్ల 'శక్తి" ప్రీమియర్ షోస్ ని ప్లాన్ చేసినప్పటికీ ఫ్రింట్స్ డిస్పాచ్ అవ్వాల్సిన టైమ్ లోనే సెన్సార్ ప్రాబ్లెమ్స్ తలెత్తడం వల్ల పలు ప్రాంతాల్లో ప్రదర్శనలు రద్దయ్యాయి. ఒక్క చెన్నైలో మాత్రం సత్యం సినిమాస్ లో మార్చి 31 రాత్రి 10.15కి షో స్టార్టయింది. ఇక శక్తి సనిమా ఎలా వుందనే మ్యాటర్ లోకి వస్తే మా ప్రతినిధితో పాటు మరికొందరు అభిమానులు, ప్రేక్షకుల అభిప్రాయాల మేరకు తొలి సగం రొటీన్ గా వుందనీ మలి సంగం కూడా ఊహించినట్టే సాగిందనీ తెలిసింది. అలాగే అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా అనుకున్న రేంజ్ లో లేక నిరాశపరిచిందని అంటున్నారు. పాటలూ, ఫైట్లూ, డ్యాన్సులూ, డైలాగులూ..అన్నీ సోసోగానే వున్నాయనీ, ఎన్టీఆర్ ప్రేక్షకాకర్షక 'శక్తి" మాత్రమే ఈ చిత్రానికి సేవింగ్ గ్రేస్ అనీ చెబుతున్నారు. మరీ రిపోర్ట్ లోని నిజా నిజాలేంటో -అసలీ 'శక్తి"లోని బలా బలాలేంటో సమగ్రంగా చర్చించుకుందాం..సమీక్షలో..!


Click it and Unblock the Notifications











